- ఎవరికి వేస్తే రాష్ట్రం పదిలమో ఆలోచించాలి
- ఒక్కో పార్టీ వెనక ఎవరున్నారో చూడాలి
- కరెంట్, సాగు, తాగునీటి సమస్యలు పరిష్కరించాం
- పదేళ్లకు ముందు.. పదేళ్ల తరవాత.. ఆలోచించాలి
- గోదావరి వరదలు రాకుండా కరకట్టలు నిర్మించాం
- వాగులపై హైలెవల్ బ్రిడ్జిలు నిర్మించుకున్నాం
- నియోజకవర్గానికో ఆస్పత్రి నిర్మించుకున్నాం
- గతంలో పాలకులు తెలంగాణను విస్మరించారు
- వజ్రం తునకలా పాత ఖమ్మం జిల్లా
- బీఆర్‌ఎస్‌తోనే తెలంగాణకు శ్రీరామరక్ష
- ప్రజాశీర్వాదసభల్లో సీఎం కేసీఆర్ పిలుపు
వరంగల్ : ఓటును ఆషామాషీగా వేయొద్దని.. అది ప్రజల ఐదేళ్ల భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. గతంలో కరెంటు లేక ఇబ్బందులుపడ్డాం. ఎన్నో అవస్థలు పడ్డాయి. ఇవాళ కరెంటు పరిస్థితి ఎలా ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రంలో 24 గంటల కరెంటు లేదు. ఒక్క తెలంగాణలోనే ఉన్నదని చెప్పారు. నర్సంపేట నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డిని ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించాలని కోరారు. సభలో సీఎం ’మాట్లాడుతూ.. మీ అందరినీ నేను కోరేది ఒకటి. ఏదైనా ప్రజాస్వామ్య పరిణితి రావాలంటే.. నేను చెప్పే నాలుగు మాటలను మీ ఊళ్లకు వెళ్లిన తర్వాత నిజానిజాలు తేల్చాలి. అప్పుడు ప్రజలు గెలవడం ప్రారంభమవుతుంది. 30న ఓట్లు పడుతయ్. 3న ఓట్లు లెక్కిస్తరు.. అక్కడికి దుకాణం అయిపోతుందని మీరు అనుకుంటరు. కానీ అక్కడికే అయిపోతు. ఆ తర్వాత తతంగం చాలా ఉంటది. ఎవరైతే నాయకులు నిలబడ్డరో వీళ్ల వెనుక చాలా పెద్ద పార్టీలున్నాయ్. అభ్యర్థి కమిట్‌మెంట్, వారి వెనుక ఉన్న పార్టీ చరిత్రను చూడాలి. వారికి అధికారం ఇస్తే ప్రజలకు ఏం చేస్తారనే విషయాలను గమనించాలి. భద్రాచలం, పినపాక, బూర్గంపాడు నియోజకవర్గాల బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభ బూర్గంపాడులో జరిగింది. ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ’సీతారామ ప్రాజెక్టు మీ కండ్ల ముందే జరుగుతున్నది. సీతమ్మ సాగర్ 37 టీఎంసీల నీటి కెపాసిటీతో ఉంటది. గోదావరి నుంచి మన ఇష్టమునన్ని నీళ్లు తీసుకోవచ్చు. పాత ఖమ్మం జిల్లాను వజ్రం తునకలా పాత ఖమ్మం తయారవుతుంది. ఏ పార్టీ వైఖరి ఏంటి.. ఎవరి నీతి ఏంది? ఎవరిని నిలబెడితే ప్రజలం నిలుబడుతాం అని ఆలోచన చేయాలి. భద్రాచలం నియోజకవర్గంలో అనేక వాగులపై ఇబ్బందులుండేవి. గర్భిణులు ప్రసవమైతే.. మంచంలో పెట్టుకొని మైళ్లకొద్దీ ఎత్తుకొని పోయే పరిస్థితి ఉండేది’ అన్నారు. ఇవాళ చాలా వాగులపై హైలెవెల్ బ్రిడ్జీలు కట్టుకున్నాం. కేసీఆర్ కిట్, అమ్మఒడి వాహనం వచ్చి ఇంటి వద్ద నుంచి దర్జాగా తీసుకెళ్లి.. ప్రసవం చేయించి ఇంటి వద్ద వదిలిపెడుతున్నది. అమ్మాయి పుడితే రూ.13వేలు, అబ్బాయి పుడితే రూ.12వేలు ఇస్తున్నం. గతంలో మహామహవులు మేధావులు పరిపాలించారు. వారు ఎందుకు ఇవ్వలేదో ఆలోచించాలి. గతంలో చాలా తక్కువ ఏరియాలో వంద పడకల ఆసుపత్రులు ఉండేవి. ఇవాళ బ్రహ్మాండంగా ప్రతి నియోజకవర్గం లో వంద పడకల ఆసుపత్రులు పెట్టుకున్నాం. గతంలో మూడు కిడ్నీ బాధితులకు డయాలసిస్ సెంటర్లు ఉండేవి. ఇవాళ బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో 103 చోట్ల డయాలసిస్ సెంటర్లు పెట్టాం. పెట్టడంతో పాటు కిడ్నీ బాధితులకు పెన్షన్ ఇస్తున్నాం. ఉచిత బస్‌పాస్‌లు సైతం ఇస్తున్నాం. మానవీయ కోణంలో ప్రజల బాధలను దూరం చేయాలని పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం అన్నారు. ఎలక్షన్లు రాంగనే.. ఆగమైపోతే.. అలవోకగా వేయొద్దు. మనం ఓటు వేయడానికి కారణం ఉండాలి. నిజా నిజాలు తేల్చాలి. ఈ జిల్లాలో కరకటక ధమనులు మొదలయ్యారు ఇద్దరు. బీఆర్‌ఎస్ పార్టీని అసెంబ్లీ గడప తొక్కనివ్వమని మాట్లాడుతున్నరు. ఇంత అహంకారమా ? బీఆర్‌ఎస్ అభ్యర్థులను అసెంబ్లీకి ప్రజలైన మీరే కదా? ఒక వ్యక్తి కాదు కదా? ఇలాంటి దుర్మార్గుల అహంకారాన్ని అణచివేయడానికి, అలాంటి వారి తాటతీయాలి. వారికి బుద్ధి చెప్పాలి. నాలుగైదు సమస్యలు వెంకట్రావ్, రేగా కాంతారావు చెప్పారు. నేను మీకు హామీ ఇస్తున్నానన్నారు. గతంలో వరదలు వచ్చినయ్. భద్రాచాలం నేను వచ్చాను.. పరిశీలన చేశాం. 14వేల కుటుంబాలకు ఇంటికి రూ.10వేల చొప్పున ఇచ్చాం. ఎవరైనా నష్టపోయే వారికి ఇండ్లు కట్టించాం. గోదావరి కరకట్టలు రూ.వెయ్యికోట్లతో కట్టాలని రిపోర్ట్ వచ్చింది. నేను స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసి వరద నివారణకు చర్యలు తీసుకుంటాం. బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే భద్రాద్రి సీతారాములను దర్శించుకొని.. ఒక పూట భద్రాచలంలో, మరొకచోట ఉంటాను. మీ మధ్యనే ఉండి రాష్ట్ర అధికారుల బృందాన్ని తీసుకొని వచ్చి అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. రెండు నియోజకవర్గాల్లోని దళితులకు దళితుబంధు ఒకేసారి ఇప్పిస్తా’నన్నారు. ధరణి పోర్టల్‌తో రైతుల భూములను ఎవరూ గోల్‌మాల్ చేయలేరని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ అభ్యర్థులు రేగా కాంతారావు, తెల్లం వెంకట్రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ’ఎన్నికలకు చాలా సమయం ఉన్నది. గ్రామాలు, పట్టణాలకు బస్తీలకు వెళ్లిన తర్వాత పెద్ద మనుషులతో చర్చ పెట్టాలి. నిజానిజాలు తేల్చాలి. వాస్తవాలను గమనించి ముందుకుపోతే మన బతుకులు బాగుపడుతయ్. లేక పోతే దెబ్బతింటాం. బాధలు పడుతాం’ అన్నారు. బీఆర్‌ఎస్ పుట్టుక మీ కండ్లముందే జరిగింది. బీఆర్‌ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కులు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. కాంగ్రెస్ చరిత్ర మీకు తెలుసు. బీఆర్‌ఎస్ పార్టీ చరిత్ర కూడా మీముందుంది. ఈ పార్టీల వైఖరిపై బాగా చర్చచేయాలని కోరుకుంటున్నా. ఈ ఎన్నిక పినపాక వరకు భద్రాచలం వరకో ఉండదు. ఇక్కడ గెలిచే అభ్యర్థులను బట్టి రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వం సరైన నడక నడిస్తే ప్రజాబాహుల్యానికి మేలు జరుగుతుంది. లేకపోతే నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ గిరిజనులు విశేషంగా ఉండే ప్రాంతం. గిరిజనులతో పాటు దళిత వర్గాల ప్రజలు ఉన్నరు. వాళ్ల బతుకులు బాగా లేవు. వాళ్లకు భూములు కూడా లేవు. అది వాస్తవం’ అన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా.. దళితుల బతుకులు అట్లనే ఎందుకున్నయ్ ? దీనికి బాధ్యలు ఎవరూ ? యుగయుగాలు, తరతరాలుగా అణచివేబడ్డ జాతికి స్వతంతం వచ్చిన తెల్లవారి నుంచే మంచి కార్యక్రమాలు పెట్టి ఉంటే దళితుల బతుకులు ఇలా ఉండేవి కావు. అందు కోసమే తెలంగాణ ప్రభుత్వం దళితబంధు కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. తెలంగాణ వచ్చిన నాడు పరిస్థితి ఏంటో మీకు తెలుసు. కరెంటు, తాగు, సాగునీటి సమస్యలు. చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రైతుల వలసలు, ఆకలి చావులు. అప్పులు కట్టలేక.. బోర్లు వేయలేక.. కరెంటు సరిగా రాక దారుణమైన పరిస్థితి ఉండేది. ఎలా వెళ్లాలో అర్థంకాని పరిస్థితి. కష్టపడి రాష్ట్రం తెచ్చుకున్నాం కాబట్టి బాధ్యతతో పటిష్టంగా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ముందుకెళ్లాలని కంకణబద్ధులమై పని చేశాం’ అని తెలిపారు. పది సంవత్సరాల పరిస్థితి, చరిత్ర మీ కండ్ల ముందున్నది. అన్నింటికన్నా ముందు మేం ఇచ్చిన పాధ్రాన్యం. రోడ్లు, సాగునీరు, తాగునీరు, కరెంటు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. మీరందరూ చూస్తున్నారు. మీ ముందే మణుగూరులో భద్రాద్రి పవర్ ఎªలాంట్ వచ్చింది. ఒకప్పుడు వాస్తవానికి వీటీపీఎస్ విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ మణుగూరులో రావాల్సింది. కానీ, సమైక్యవాదులు కుట్ర చేసి మణుగూరుకు రాకుండా విజయవాడకు తరలించారు. అందువల్ల మనం చాలా నష్టపోయాం. కనీసం చిన్నదైనా సరే ఇక్కడైనా రావాలని చెప్పి మణుగూరులో పవర్ ఎªలాంట్ పెట్టుకున్నాం. ఎంతో కొంత మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దాని ద్వారా లభిస్తున్నయ్. అన్నింటిని మించింది ప్రధాన రంగం వ్యవసాయరంగం. రైతులు అప్పుల్లో ఉన్నారు. అప్పులు కట్టలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. ఆ బాధలు పోవాలని.. రైతులు చక్కగా బతకాలని.. వ్యవసాయ స్థిరీకరణ జరగాలని ఎన్నో ప్రయత్నాలు చేశాం. అందులో విజయం సాధించాం’ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రభుత్వం సపోర్ట్ లేకుండా వ్యవసాయం నిలబడలేదు. అన్ని దేశాల్లో సబ్సిడీలు ఇచ్చి వ్యవసాయానికి సపోర్ట్ చేస్తున్నాయ్. మన దేశంలో ఉన్న దుర్మార్గమైన పాలసీల వల్ల రైతులకు ఎలాంటి సపోర్ట్ లేదు. అందుకే మన దగ్గర రెండు మూడు కార్యక్రమాలు తీసుకున్నాం. రైతులకు ప్రాజెక్టుల ద్వారా నీటి సరఫరా చేస్తే నీటి తీరువా లేదు. గతంలో ఉన్న బకాయిలను రద్దు చేశాం. మోటర్లు కాలిపోకుండా నాణ్యమైన 24గంటలు ఉచితంగా ఇస్తున్నాం. పెట్టుబడి సాయం ఇస్తున్నాం. రైతులకు ఏదైనా ఇబ్బంది జరిగి చనిపోతే ఆ వారి ఇంటికి రూ.5లక్షలు వారం రోజుల్లో వస్తున్నయ్. రైతుబీమా బ్రహ్మాండంగా పని చేస్తున్నది. రైతుల గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. వీటన్నింటిని తీసుకువచ్చి ధరణి పోర్టల్ తీసుకువచ్చాం. ప్రభుత్వం తన వద్ద ఉన్న అధికారాన్ని మీకే ఇచ్చింది. మీ భూమి యాజమాన్యం మారాలంటే.. గతంలో ప్రభుత్వ అధికారులు మార్చేది. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. మీ బొటన వేలు పెడితే తప్ప.. మీ భూమిని ఎవరూ గోల్‌మాల్ చేయలేరు. ఇప్పుడిప్పుడే రైతులు తేరుకుంటున్నర్. అప్పుల నుంచి తేరుకుంటున్నరు’ అన్నారు.