Sunday, May 5, 2024

బ్రహ్మదేవుడి ఆలయంలో ప్రధాని

తప్పక చదవండి
  • ఆశీర్వదించిన ఆలయ పూజారులు..
  • పవిత్ర పుష్కర్ సరస్సు దగ్గరలోని ఆలయం..
  • బహిరంగ ర్యాలీకోసం జైపూర్ వెళ్లిన ప్రధాని..

ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్ లో బ్రహ్మదేవుని ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుడిచూట్టూ తిరిగి ప్రదక్షణలు చేశారు. పూజల అనంతరం ఆలయ పూజారులు మోడీ తలపై తలపాగా పెట్టి ఆశీర్వదించారు. అనంతరం బహిరంగ ర్యాలీ కోసం మోడీ హెలికాప్టర్‌లో జైపూర్ లోని ర్యాలీకి బయలుదేరారు ఈ ర్యాలీలో కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, కైలాష్ చౌదరి, రాజస్థాన్‌కు చెందిన ఇతర బీజేపీ నేతలు హాజరయ్యారు.. కేంద్రంలోని బీజేపీ 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ర్యాలీ జరిగింది.. హిందూ పురణాల ప్రకారం త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మకు ప్రపంచ వ్యాప్తంగా ఒకే ఒక్క ఆలయం ఉంది. అదే రాజస్థాన్ లోని పుష్కర్ లోని ఆలయం. ఇది పవిత్రమైన పుష్కర్ సరస్సుకి దగ్గరగా ఉంటుంది. క్రీస్తు శకం 14 వందల సంవత్సరంలో దీనిని నిర్మించారు. ఆలయం పాలరాయి,రాతి పలకలతో నిర్మించబడింది. ఆలయ గర్భగుడిలో నాలుగు తలల బ్రహ్మ, ఆయన భార్య గాయత్రి (వేదాల దేవత) విగ్రహం ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు