Tuesday, April 23, 2024

బాబోయ్ భారీ వర్షం..

తప్పక చదవండి
  • ఒక్కసారిగా మారిపోయిన వాతావరం..
  • నగరవాసులకు తప్పని తిప్పలు..
  • జూన్ 7 నుండి 11 మధ్య తెలంగాణలోకి
    నైరుతి రుతుపవనాలు..

హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం దాకా భానుడి భగభగలతో అల్లాడిన భాగ్యనగరం అకస్మాత్తుగా చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, కూకట్‌పల్లి, బాలానగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ సరఫరా నిలిచింది. రోడ్ల మీదకు భారీగా వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

గత కొద్దిరోజులుగా ఎండ వేడి, ఉక్కపోతతో అల్లాడుతున్న జనం వర్షం కారణంగా కాస్త ఉపశమనం పొందారు. మరోవైపు.. నైరుతి రుతుపవనాలు జూన్ 7 నుంచి జూన్ 11 మధ్య తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందనీ, భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తన అంచనాలో తెలిపింది. జూన్ నెలాఖరు నుంచి రాష్ట్రంలో రుతుపవనాలు తీవ్రరూపం దాల్చనున్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం జూన్ 7 నుంచి 11 వరకు రుతుపవనాలు తెలంగాణను తాకుతాయి. రుతుపవనాల రాకతో మొదట్లో వర్షాలు తీవ్రంగా ఉంటాయనీ, వాతావరణ శాఖ తెలిపింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు