Friday, November 1, 2024
spot_img

కిషన్ రెడ్డికి వినతిపత్రం..

తప్పక చదవండి
  • తెలంగాణ ఉద్యమకారులకు రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పించారు..
  • విజ్ఞప్తి చేసిన టి.ఎస్. జాక్, ఓయూ జాక్.. ప్రతినిధులు..

హైదరాబాద్ : శనివారం రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డికి టి.ఎస్. జాక్, ఓయూ జాక్ తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులకు రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం కల్పించాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.. దీనికి వారు సానుకూలంగా స్పందించారు.. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ప్రత్యేక తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమంలో యూనివర్సిటీ విద్యార్థులు యావత్ తెలంగాణ విద్యార్థులను, ప్రజలను చైతన్యం చేసి ఉద్యమాన్ని ఊవెత్తిన తీసుకెళుతున్న క్రమంలో అనేక మంది విద్యార్థి ఉద్యమకారులు అరెస్టులు, లాఠీదెబ్బలు సైతం నిలబడి పోరాటం చేస్తే ఎంతోమంది విద్యార్థులకు తలలు పగిలి కాళ్లు, చేతులు విరిగి నెత్తురులో మునిగాయి.. చివరకు ఆత్మ బలిదానాలను చేసుకొని ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాము. ఏర్పాటైన రాష్ట్రంలో పోరాటంలో ఉన్న విద్యార్థి ఉద్యమకారులకు ప్రభుత్వ పాలనలో తగిన ప్రాతినిధ్యం లేదు.. విద్యార్థుల త్యాగాల పునాదుల మీద ఏర్పాటైన రాష్ట్రం ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీల శాఖలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా ఆనాడు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న నాయకులకు నేడు ప్రభుత్వాల పాలనలో, పదవులలో ప్రముఖ స్థానం కల్పించాయి. రాష్ట్ర సాధనలో త్యాగాలు ఒకరివి అయితే భోగాలు ఇంకొకరివైనాయి. దీనిని ఉద్యమాల పోరుగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ ఖండిస్తుంది.

తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చే దగ్గరి నుండి నామినేటెడ్ పోస్టుల, వారి పార్టీ పదవుల అవకాశాల వరకు విద్యార్థి, ఉద్యమకారులకు ఇవ్వాలి. నూటికి నూరు శాతం త్యాగాలు చేసిన విద్యార్థి ఉద్యమకారులకు ఒక్క శాతం కూడా అవకాశాలు దక్కడం లేదు. రాష్ట్ర సాధనలో ఒకానొక సందర్భంలో అందరూ చేతులెత్తేసిన, తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయాలని నాటి ఆంధ్ర పాలకులు కుట్ర చేసిన యావత్ విద్యార్థి లోకం భుజానికెత్తుకుని తమ చదువులను పక్కనపెట్టి, ప్రాణాలకు సైతం తెగించి కొట్లాడీ రాష్ట్రం సాధిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, వివిధ పార్టీల రాష్ట్ర శాఖలు పుట్టుకొచ్చి రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ప్రత్యేక తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. “ప్రభుత్వంలో, పార్టీలలో విద్యార్థి ఉద్యమకారులకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వడం అంటే పోరాడి సాధించుకున్న తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించినట్టు లేకుంటే 1200 మంది బలిదానాలను, ఉద్యమకారులను, వారి త్యాగాలను అవమానపరిచినట్లే…”

- Advertisement -

ఇప్పటి నుండి వచ్చే ఎన్నికల్లో ప్రతి రాజకీయ పార్టీ తగిన ప్రతినిత్యాన్ని ఇవ్వాలని తెలంగాణ విద్యార్థి జాయింట్ ఆక్షన్ కమిటీ, ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ లు అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తున్నాయి.

రాజకీయ డిక్లరేషన్ :

  1. తెలంగాణ సాధించిన విద్యార్థి ఉద్యమకారులకు ప్రతి రాజకీయ పార్టీ నుంచి 10 ఎమ్మెల్యే టికెట్లు, 2 ఎంపీ టికెట్లు ఇవ్వాలి.
  2. ప్రభుత్వ పాలనలో 2 మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు ఇవ్వాలి.
  3. అన్ని పార్టీలు పార్టీ పదవులలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో కీలకమైన పదవులు ఇవ్వాలి.
  4. రాజకీయ పార్టీలు యువతకు తప్పనిసరిగా అవకాశం కల్పించాలి.
  5. అమరుల కుటుంబం నుండి ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవి యివ్వాలి.

ఈ కార్యక్రమంలో టి.ఎస్. జాక్ ఛైర్మన్ రుద్రావరం లింగస్వామి, గాదె వెంకట్, పూసల రమేష్, నోముల శేషు, లెనిన్, పాపారావు, ఓదెలు, పులిగంటే సురేష్, సాయి కిరణ్, లాలూ పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు