Friday, March 29, 2024

చైనా ను వణికిస్తున్న మరో కొత్త వైరస్

తప్పక చదవండి

చైనాలో కొత్త క‌రోనా వేరియంట్ విజృంభిస్తోంది. ఆ వేరియంట్ కేసులు జూన్ నెల‌లో తారా స్థాయికి చేరే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో వ్యాక్సిన్ల స‌ర‌ఫ‌రాను పెంచేసింది. చైనాలో ప్ర‌స్తుతం వారానికి దాదాపు 65 మిలియ‌న్ల మందికి కొత్తగా వైర‌స్ సోకే ప్ర‌మాదం ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. ఎక్స్‌బీబీ వేరియంట్ వ‌ల్ల చైనాలో మ‌ళ్లీ క‌ల‌క‌లం మొద‌లైంది. జీరో కోవిడ్ పాల‌సీ నుంచి ఇటీవ‌ల చైనా ఫ్రీ అయిన విష‌యం తెలిసిందే.

ప్ర‌ఖ్యాత వైరాల‌జిస్ట్ జాంగ్ నాన్‌షాన్ ప్ర‌కారం రెండు కొత్త వేరియంట్లు చైనాలో అల‌జ‌డి సృష్టిస్తున్న‌ట్లు ఇటీవ‌ల ద వాషింగ్ట‌న్ పోస్టు ఓ క‌థ‌నాన్ని రాసింది. అయితే ఆ వేరియంట్ల కోసం వ్యాక్సిన్ల‌ను రిలీజ్ చేసిన‌ట్లు కూడా ఆయన తెలిపారు. ఎక్స్‌బీబీ ఒమిక్రాన్ స‌బ్‌వేరియంట్లు అయిన ఎక్స్‌బీబీ.1.9.1, ఎక్స్‌బీబీ.1.5, ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ల కోసం కొత్త వ్యాక్సిన్లు వ‌చ్చిన‌ట్లు చెప్పారు. మ‌రికొన్ని రోజుల్లో కొత్త వ్యాక్సిన్ల‌కు అనుమ‌తి ఇవ్వ‌నున్న‌ట్లు జాంగ్ వెల్ల‌డించారు.

- Advertisement -

తాజాగా ప్ర‌బ‌లుతున్న వైర‌స్ వ‌ల్ల ప్ర‌జ‌లు ఎక్కువ స్థాయిలో అనారోగ్యానికి గుర‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. అమెరికాలో కూడా కొత్త వేరియంట్ల వ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్ కేసులు పెరుగుతున్నాయి. గ‌త నెల రోజుల నుంచి కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్న‌ట్లు బీజింగ్‌లోని అంటువ్యాధుల నియంత్ర‌ణ సంస్థ వెల్ల‌డించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు