Thursday, May 16, 2024

ఢిల్లీలోనే మకాం వేసిన షర్మిల

తప్పక చదవండి
  • కెసి వేణుగోపాల్‌, ఖర్గేలతో విడివిడిగా భేటీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీలో చేరిన షర్మిల ఢిల్లీలోనే ఉంటూ అక్కడి అగ్ర నేతలందరితో భేటి అవుతున్నారు. శుక్రవారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేతో వైఎస్‌ షర్మిలా రెడ్డి సమావేశమ య్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సమావేశంలో మాణిక్కం ఠాగూర్‌ కూడా పాల్గొన్నారు. ఉదయం కేసీ వేణుగోపాల్‌ను షర్మిలారెడ్డి కలిశారు. ఆమె తన రోల్‌ ఏమిటో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అలాగే తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారన్నదానిపై ఆసక్తిగా ఉన్నారు. మరోవైపు ఎపిలోనూ ఆమె రాకకోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆల్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్‌ లో చేరేందుకు సిద్దమని ప్రకటించారు. కాంగ్రెస్‌ దేశంలో అతి పెద్ద లౌకిక పార్టీ. అది దేశ సంస్కృతిని కాపాడిరది. ఈ దేశ పునాదిని నిర్మించింది కాంగ్రెస్‌ పార్టీయే. దేశంలో అన్ని వర్గాలకు సేవలందించింది. రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర ద్వారా భారత ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు. ఆయన వల్లే కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. తెలంగాణలో కూడా గెలవడం ఖాయమని తెలిసి.. కేసీఆర్‌ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు కాంగ్రెస్‌ కు మద్దతిచ్చాను. తెలంగాణలో కాంగ్రెస్‌ విజయంలో ఆ రకంగా నా పాత్ర కూడా ఉన్నందుకు సంతోషంగా ఉంది. కుల, మత. వర్గ తేడాల్లేకుండా ప్రతి సెవర్గానికీ నమ్మకం కలిగించే పార్టీ కాంగ్రెస్‌. రాహుల్‌, ఖర్గే నాయకత్వంలో ప్రజలకు మేలు చేస్తుందన్న విశ్వాసం నాకుందని పార్టీలో చేరిన తర్వాత షర్మిల తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు