Monday, April 29, 2024

హెచ్ ఎం డీ ఏ కాదిది.. !

తప్పక చదవండి
  • హైదరాబాద్ మెడకు దిగేసిన అనకొండ..!
  • ప్రతిష్టాత్మక ప్రభుత్వ శాఖలో మరో భారీ అవినీతి తిమింగలం…!
  • బాలకృష్ణను పట్టారు సరే.. ప్లానింగ్ ఆఫీసర్ యాదగిరి రావు సంగతేంటి..?
  • ఎన్.జీ.టి. ఆదేశాలంటే ఈయనగారికి లెక్కేలేదు..!
  • ఎఫ్టిల్, బఫర్ జోన్లలో అడ్డగోలుగా నిర్మాణ అనుమతులిచ్చిన పచ్చి అవినీతి అధికారి..
  • చెరువులో ఎలాంటి ఎన్.ఓ.సి లేకుండానే నిర్మాణ అనుమతులు ఇవ్వచ్చట.. హవ్వ..
  • అక్రమ నిర్మాణాల అనుమతులపై ఇతగాడిని వివరణ అడగొద్దట..ఇదేమి చోద్యం..?
  • మీడియాతో మాట్లాడొద్దని విద్యాధర్ ఆదేశాలు ఇచ్చాడట..
  • అసలు హెచ్.ఎం.డి.ఏ లో ఏమి జరుగుతుంది..?
  • యాదగిరి రావు వింత పోకడ దేనికి సంకేతం.. ?
  • ఇలాంటి అధికారులుంటే చెరువుల పరిరక్షణ ఎలా సాధ్యమవుతుంది..?

అన్నీ ప్రశ్నలే సమాధానాలు మాత్రం లేవు.. గత ప్రభుత్వ హయాంలో అవినీతి బురదలో కూరుకు పోయింది హెచ్.ఎం.డీ.ఏ. ఆ బురదను తీసి హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీని శుభ్రం చేసేది ఎవరు..? ఎలాంటి కనీస పద్ధతులు పాటించకుండా ప్రజలకోసం ఉపయోగపడాల్సిన చెరువులను అడ్డంగా మేస్తున్న అవినీతి తిమింగలాలైన అధికారులను కట్టడి చేయకపోతే.. హైదరాబాద్ లో ఒకప్పుడు చెరువులు ఉండేయట .. అని చెప్పుకోవాల్సిన దుర్భర పరిస్థితులు ఎదురుకానున్నాయి.. ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నెలకొని ఉన్న ఎన్నో చెరువులు కనుమరుగైపోయాయి.. ఈ దౌర్భాగ్యం ఇక ముందు కలుగకూడదు.. నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా చెరువులకు మంచిరోజులొస్తాయని ఆశిద్దాం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిపెట్టి చక్కదిద్దుతాడని పలువురు కోరుకుంటున్నారు.. హెచ్.ఎం.డీ.ఏ. లో ఏమి జరుగుతోంది..? యాదగిరి రావు చరిత్ర ఏమిటి..? విద్యాధర్ ఇచ్చిన ఆదేశాలు ఏమిటి..? వీటన్నిటికీ పక్కా ఆధారాలతో వరుస కథనాలను మీముందుకు తీసుకుని రానుంది ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు