- కాచిగూడా, అంబర్ పేట్ లో ఈ కార్యాలయం మంత్రి కేటీఆర్
చేతులమీదుగా ప్రారంభం కావడం ఎంతో సంతోషదాయకం.. - ఈ వార్డు కార్యాలయాన్ని అంబర్ పేట్ నియోజకవర్గ ప్రజలు
వినియోగించుకుని సత్వర సమస్యలు పరిష్కరించుకోవాలి..
హైదరాబాద్,
కేటీఆర్ మానస పుత్రిక వార్డు కార్యాలయం అన్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది, బీ.ఆర్.ఎస్. రాష్ట్ర సీనియర్ నాయకురాలు, బీసీ మహిళా సంక్షేమ సంఘం, రాష్ట్ర అధ్యక్షులు, గుండ్రాతి శారదా గౌడ్.. నగర పౌరులకు సుపరిపాలనలో భాగంగా సర్వరోగనివారిణిగా ప్రజల చెంతకు పాలన, ఏ సమస్య వచ్చినా అన్ని సమస్యలకు పరిష్కారం చూపే దిశగా.. అన్ని శాఖల అధికారులు ఇక్కడ విధులు నిర్వహిస్తారు.. దేశంలోనే మొదటిసారిగా ఇలాంటి వ్యవస్థను మన హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయడం.. అదికూడా అంబర్పేటలో, కాచిగూడలో మంత్రివర్యులు కేటీఆర్ ప్రారంభించడం మన అంబర్పేట ప్రజలకు గర్వకారణం అని ఆమె అన్నారు.. అలాగే మరో ముఖ్యమైన సౌలభ్యం ప్రతి సమస్య పరిష్కారానికి నిర్ణీత గడువుతో కూడిన సిటిజెన్ చార్టర్ కూడా జిహెచ్ఎంసి ఈ వార్డ్ కార్యాలయం ద్వారా పౌరులకు అందిస్తుంది అని మంత్రి కేటీఆర్ చెప్పడం సంతోషదాయకం.. దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి.. తద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి మంచి రాపో పెరుగుతుంది అన్నారు.. భవిష్యత్ లో పోలీస్ శాఖ, ఆరోగ్య శాఖ అధికారులను కూడా వార్డ్ కార్యాలయానికి అనుసంధానం చేస్తాం అన్నారు.. దీనితో పరిపాలన వికేంద్రీకరణ జరిగి ప్రజల వద్దకు పాలన సుగుమం అవుతుందని శారదా గౌడ్ తెలిపారు.. ఈ వార్డ్ కార్యాలయాన్ని అంబర్పేట నియోజకవర్గ ప్రజలు సత్వర సమస్యల పరిష్కారం కొరకు ఉపయోగించుకోవాలని సూచించారు గుండ్రాతి శారదాగౌడ్. ఈ కార్యక్రమంలో రేణుక, లలిత పాల్గొన్నారు..