Saturday, July 27, 2024

152 మంది పై అక్రమంగా మోపిన ఉపా కేసునువెంటనే ఎత్తివేయాలి : పీడీఎస్యూ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్

తప్పక చదవండి
  • ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ప్రొఫెసర్ హరగోపాల్, పీ.ఓ.బబ్లీ. జాతీయ కన్వీనర్ వి సంధ్య తదితరులు..

హైదరాబాద్,
ములుగు జిల్లా తాడ్వాయి పోలీసులు 2022 ఆగష్టు 9 న పీ.ఓ.డబ్ల్యు. జాతీయ కన్వీనర్ కామ్రేడ్ వి.సంధ్య, ప్రజాపక్ష మేధావి ప్రొఫెసర్ జీ.హరగోపాల్ తదితర 152 మంది ప్రజాసంఘాల నాయకులపై తప్పుడు పద్ధతుల్లో రాజద్రోహ కుట్ర కేసు ఐన ఉపా కేసును నమోదు చేశారు. వీరంతా మావోయిస్టు పార్టీకి అనుబందంగా ఉండే సంఘాల్లో పని చేస్తూ రాజద్రోహనికి పాల్పడుతున్నారని పేర్కొని, వీరినందరిని కఠినంగా శిక్షించాలని అక్రమంగా, తప్పుడు కేసులను బనాయించారు. ఉపాతో
పాటు అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేస్తున్నది. కామ్రేడ్ వి. సంధ్య గత నాలుగు దశబ్దాల కు పైగా మహిళల హక్కుల కోసం పోరాడుతున్న చరిత్ర అందరికి తెలిసిందే. ఆ కామ్రేడ్ ఏనాడు రహస్యంగా లేదు. పీ.ఓ.బబ్లీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా, జాతీయ కన్వీనర్ గా పనిచేస్తున్న విషయం తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సాధనలో మొదటి వరుసలో నిలబడి కొట్లాడిన మాట వాస్తవం.. నేటి ముఖ్యమంత్రి కెసిఆర్ తో సహా అందరికి తెలిసిన విషయమే. మహిళా హక్కుల కోసం నలభై ఏళ్లకు పైగా అవిశ్రాంతంగా ప్రజాస్వామిక పద్ధతుల్లో పోరాడుతున్న సంధ్యను నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన వ్యక్తి గా ముద్రవేయడం అత్యంత దుర్మార్గమైనది. హైదరాబాద్ నగరాన్ని కేంద్రంగా చేసుకొని అలుపెరుగని మహిళా నాయకురాలుగా ఉంటున్న సంధ్యను మావోయిస్టు దళాల్లో తిరుగుతున్నట్లు, ఆ పార్టీ లోకి క్యాడర్ ను రిక్రూట్ చేస్తున్నట్లు నూటికి నూరు పాల్ల అబద్దాలతో పోలీసులు కట్టుకతలల్లి ఉపా లాంటి రాజద్రోహ కుట్ర కేసును బనాయుంచడాన్ని పీ.డీ.ఎస్.యూ. రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. బొంబాయికి చెందిన న్యాయమూర్తి సురేష్ రెండేళ్ల క్రితం మరణిస్తే ఆయన పేరును కూడా ఈ కేసులో ఇరికించడం తెలంగాణ పోలీస్ ప్రత్యేకతగా ఉన్నది. అంతే కాదు, తెలుగు నేలకే కాదు యావత్ దేశానికి, ఆ మాటకొస్తే ప్రపంచానికి హక్కుల నాయకుడిగా, మేధావిగా, గొప్ప రాజనీతి ఆచార్యులుగా కొన సాగుతున్న ప్రో. హరగోపాల్ పైనా ఈకేసును మోపారు. అరుణదయ విమలక్క, మోహన్ బైరాగి తో పాటు తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘము మాజీ అధ్యక్షులు గా పని చేసిన రఘునాధ్, సి.ఎల్.సి. రాష్ట్ర అధ్యక్షులు ప్రొ. గడ్డం లక్షణ్, ప్రొ. పద్మజా షా, ప్రొ కాశీoలతోసహ మొత్తం 152 మందిమీద మోపిన ఈ కేసు పోలీసుల బుర్రల్లో పుట్టిన కేసుగానే ఉన్నది. కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వాళ్ళే గాకుండా ఇప్పటికే జైల్లో ఉండి బెయిల్ పై ఉన్న సుధా భరద్వాజ్, సురేంద్ర గాడ్లిoగ్ తదితరులనేక మంది పై పెట్టారు. ములుగు జిల్లా పోలీసులు అక్రమంగా బనాయించిన ఈ అక్రమ, తప్పుడు కేసును వెంటనే ఉపసహారించుకోవాలని మాపార్టీ తెలంగాణ రాష్ట్ర సర్కార్ ను డిమాండ్ చేస్తున్నది. ప్రజాసంఘాల నాయకుల్ని, కార్యకర్తలను నిషేధిత మావోయిస్టు లుగా ముద్రవేసి, వారిపై దేశద్రోహం, అర్మ్స్ యాక్ట్ లాంటి చట్టాలు మోపి అణచివేత, నిర్భందానికి గురి చేయడం ఎంతమాత్రం సరికాదని ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన తోపాటు, పోరాడి సాధించుకున్న తెలంగాణ లో అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న అనేక మంది ప్రజా నాయకులను, మేధావులను అక్రమ, కుట్ర కేసుల్లో ఇరికించడాన్ని ఇకనైనా మానుకోవాలని పీడీ.ఎస్.యూ. రాష్ట్ర అధ్యక్షులు, మామిడి కాయల పరశురాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఇడం పాక విజయ్ కన్నాలు డిమాండ్ చేస్తున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు