Wednesday, May 1, 2024

విశ్వనగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దినఘనత మంత్రి కెటిఆర్

తప్పక చదవండి
  • 9వ ఫేస్ లో పార్కు పనులకు శంకుస్థాపన..
  • దేశంలో హైదరాబాద్ కొత్త పెట్టుబడులకు కేంద్రంగా నిలిచింది..
  • ముచ్చటగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం : ఎమ్మెల్యే మాధవరం

కూకట్ పల్లి నియోజకవర్గం, కెపిహెచ్పి డివిజన్లో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా పలు పార్కుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు. అదేవిధంగా 9 వ ఫేస్ లోని రెండున్నర ఎకరాల స్థలంలో పార్కు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.1.50 కోట్లు, మొత్తం రూ.4.50 కోట్ల వ్యయంతో కూడిన పనులకు శంకుస్థాపన నిర్వహించారు.. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ, దాదాపు రూ.200 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని కేవలం ప్రజల కోసం 24 గంటల్లో జీవో ఇచ్చిన మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. నేడు హైదరాబాద్ మహా నగరాన్ని ప్రపంచ పటంలో విశ్వ నగరంగా తీర్చిదిద్దే క్రమంలో కేటీఆర్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారని అనడంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు. కేపిహెచ్పి డివిజన్లోని గల్లి గల్లి కి పార్కులను నిర్మించామని అండర్ఫాస్ బ్రిడ్జిలు.. జేఎన్టీయూ ఫై ఓవర్.. ఖైతాపూర్ ఫ్లై ఓవర్ వంటి నిర్మాణాలతో ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చడమే కాకుండా నేడు ప్రతి ఒక్కరూ హైదరాబాద్
ఆదాబ్ హైదరాబాద్
మహానగరంలో ప్రశాంతమైన వాతావరణంలో అన్నదమ్ముల్లా జీవిస్తున్నారని ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అవలంబిస్తున్న విధానాలే కారణమని కొనియాడారు. దేశంలోనే పెట్టుబడుల కేంద్రంగా హైదరాబాద్ నిలిచిందంటే తెలంగాణ రాష్ట్రం అవలంబిస్తున్న పారిశ్రామిక విధానాలు ముఖ్య కారణమని
అన్నారు… కూకట్పల్లి నియోజకవర్గానికి వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి అభివృద్ధికి సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.. వచ్చే ఎన్నికలలో తిరిగి బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఇంకా బాగా అభివృద్ధి పరుచుకుంటామని సందర్భంగా ఆయన ఈ తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలతో పిల్లలకు ఫూల్స్ షటిల్ ఆహ్లాదకరమైన మొక్కలు, కమ్యూనిటీ హాల్స్ తో 9వ ఫేస్ లోని రెండున్నర ఎకరాల్లో పార్కును రూపొందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో.. కోఆర్డినేటర్ సతీష్ అరోరా.. కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు.. డివిజన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి.. అధికారులు ఈ ఈ సత్యనారాయణ.. డి ఈ ఆనంద్, ఏ ఈ సాయి ప్రసాద్ బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు