Sunday, October 6, 2024
spot_img

జులై 2న ఖమ్మం రానున్న రాహుల్..

తప్పక చదవండి
  • లక్షలాది మందితో బహిరంగ సభ..
  • తొడగొట్టిన పొంగులేటి..

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు.. )

భారాస (అప్పట్లో తెరాస) అధికారంలోకి వచ్చాక ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మాయలగారడీలో కేసీఆర్ ‘సిద్ధహస్తుడు’ అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అనంతరం పొంగులేటి, జూపల్లి దిల్లీలో మీడియాతో మాట్లాడారు. జులై 2న ఖమ్మంలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్నామని ప్రకటించారు. భారాస ఆవిర్భావ సభను మించి.. కనీవిని ఎరుగని రీతిలో ఖమ్మంలో సభ నిర్వహిస్తామని చెప్పారు. ‘భారాస నేతలకు సవాల్ విసురుతున్నా.. మా ఖమ్మం సభకు ఎన్ని లక్షల మంది వస్తారో లెక్కేసుకోండి’ అని పొంగులేటి అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు