Tuesday, May 7, 2024

ప్ర‌భుత్వం వ‌చ్చిన తొలి ఏడాదిలోనే 2 ల‌క్ష‌ల కొలువుల భ‌ర్తీ..

తప్పక చదవండి
  • అధికారంలోకి వచ్చాక పోడు భూములు అడవి బిడ్డలకే..
  • ప్ర‌భుత్వం వ‌చ్చిన తొలి ఏడాదిలోనే 2 ల‌క్ష‌ల కొలువుల భ‌ర్తీ..
  • పీపుల్స్ మార్చ్ కు జై కొడ్తున్న ప్ర‌జ‌లు.
  • పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.

సూర్యాపేట ప్రతినిధి : ప్ర‌భుత్వం వ‌చ్చిన తొలి ఏడాదిలోనే 2 ల‌క్షల ఉద్యోగాలు భ‌ర్తీచేస్తామ‌ని, నిరుద్యోగుల‌కు నెల‌కు రూ.4 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు.ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌ సోమవారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండ‌లం కొండల రాయిని గూడెం, మున్యానాయ‌క్ తండా,(కర్వి నాగారం)గంటవారి గూడెం,రాజ్ తండా,పాండ్య నాయక్ తండా మీదగా కొనసాగింది.ఈ సంద‌ర్భంగా భ‌ట్టి మాట్లాడుతూ.. వ‌చ్చేది ఇందిర‌మ్మ రాజ్య‌మే అని, కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మే అని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు అర్హ‌త క‌లిగిన ప్రతి ఒక్క‌రికీ రెండు గ‌దుల ఇందిర‌మ్మ ఇండ్లు క‌ట్టుకునేందుకు రూ. 5 ల‌క్ష‌లు,వంద రోజులు ప‌నికి వెళ్లే వారికి, నిరుపేద కూలీల‌కు ఏడాది రూ.12 వేలు ఇస్తామ‌ని హామీ ఇచ్చారు.అంతేకాక ఇంట్లో ఉండే ఇద్ద‌రు ముస‌ల‌వ్వ‌కు,తాత‌కు వృద్ధాప్య ఫించ‌న్ ఇస్తామ‌ని, ప్ర‌భుత్వం వ‌చ్చిన తొలి ఏడాదే 2 ల‌క్షల ఉద్యోగాలు భ‌ర్తీచేస్తామ‌ని స్ప‌ష్టంగా చెప్పారు. నిరుద్యోగుల‌కు నెల‌కు రూ.4 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు. గ్రామ‌స్తులంతా భ‌ట్టి కి గ్రామ స‌మ‌స్య‌లు తెలిపారు.చ‌దువుకున్న బిడ్డ‌ల‌కు కొలువులు లేవు,ఇండ్లు లేవు,గ్యాస్ ధ‌ర కొనేట్లుగాలేదు,భూములు లేవు, బ‌తికేందుకు ఉపాధి అవ‌కాశాలు లేవంటూ చెప్పారు.మున్యా నాయక్ తండా లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్మించిన ఎస్సారెస్పీ నీటి కాలువ‌ను విక్ర‌మార్క,దామన్న ప‌రిశీలించారు. నాటి కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జ‌ల‌య‌జ్ఞంలో భాగంగా నిర్మించిన కాకాతీయ కాలువ ఎక్స్ టెన్ష‌న్ ఫేజ్ 2 కాలువ ద్వారా నీళ్లు వ‌స్తున్నాయ‌ని చెప్పారు.రాష్ట్రం లోని అడవిబిడ్డలను అడవి నుంచి బయటకు వెల్లగొట్టేలా కేసీఆర్ ప్రభుత్వం క్రూరమైన, కుట్రపూరితమైన బీఆర్ఎస్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాo అని అన్నారు.మరో నాలుగు నెలల తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు పెద్ద ఎత్తున ఆదివాసీలకు భూమిపైనా, అడవిపైన హక్కులను వారికే ధారదత్తం చేస్తే నిర్ణయాలు తీసుకుంటాం అంతేగాక అటవీ హక్కుల చట్టాన్ని తూ.చా తప్పకుండా అమలు చేస్తాం అని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలొకి వచ్చిన వెంటనే పోడు భూముల సమస్యలను వెంటనే పరిష్కరిస్తాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రాం రెడ్డి దామోదర్ రెడ్డి,డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు