- నయాదందాకు తెరలేపిన దారెడ్డి కృష్ణారెడ్డి..
- రాందాస్ మోహన్ గౌడ్, వెంకట్ గౌడ్ తో కలిసి ఘరానా మోసం..
- న్యాయం కోసం రోడ్డుపై భైటాయించిన కేతిరెడ్డిపల్లి గ్రామస్తులు..
- మొన్న న్యాయం చేస్తానని నేడు నట్టేట ముంతున్నాడు..
- ఏండ్లు గడుస్తున్న కట్టుకున్న ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేపియ్యకుండా ఎగనామం..
- ఇప్పుడు ఒక్కో ఇంటికి మరో రూ. 4 లక్షలు ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేపిస్తా అంటూ కొత్త రాగం..
- అసలు పట్టాదారుడితో కేసులు పెట్టించి కోర్టు చుట్టు తిప్పుతున్నాడు..
- ఊర్లో ఉండల్నా.. చావాల్నా అంటూ రోదిస్తున్న గ్రామస్తులు..
తనను నమ్మిన గ్రామ ప్రజలనే దారెడ్డి కృష్ణారెడ్డి నమ్మించి మోసం చేసి.. చివరికి కేసులు పెట్టించి కోర్టు చుట్టు తిప్పుతున్నాడని కేతిరెడ్డిపల్లి గ్రామ ప్రజలు రోడ్డుపై బైటాయించి న్యాయం కోసం ఆవేదనతో కేకలు వేశారు.. వివరాల్లోకి వెళితే.. .
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలంలోని, కేతిరెడ్డిపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే సంఖ్య 2లో.. 2 ఎకరాల 35 గుంటలలోని.. 53 ప్లాట్లను దారెడ్డి కృష్ణారెడ్డి తమ అవసరాలను, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నాటి ధర (2004 సం.. నుండి ఒక్కో ప్లాటుకు 35 వేల పైచిలుకు) ప్రకారం తమకు అగ్రిమెంట్ చేసి అమ్మాడని గ్రామస్తులు పేర్కొన్నారు. అయితే 20 ఏండ్ల నుండి తాము (53 కుటుంబీకులకు) కొనుక్కుని నివాసముంటున్న నివాస గృహలకు రిజిస్ట్రేషన్ చేయాలని దారెడ్డి కృష్ణారెడ్డిని చాలా సార్లు అడిగేతే.. అసలు పట్టాదారుడు రాందాస్ మోహన్ గౌడ్ అందుబాటులో లేడని, అతను వచ్చాక తప్పక రిజిస్ట్రేషన్ చేపిస్తానని నాడు నమ్మించి.. నేడు దారెడ్డి కృష్ణారెడ్డి నట్టేట ముంచాడని గ్రామస్తులు తీవ్రంగా వాపోతున్నారు. రెండు సంవత్సరాల క్రితం నగరానికి చెందిన పట్టాదారుడు రాందాస్ మోహన్ గౌడ్ వచ్చి నా పట్టా భూమిలో ఇల్లు ఎలా కట్టారని కేసు వేసి కోర్టుల చుట్టు తిప్పుతున్నాడని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. దీనికంతటికి అసలు కారణం దారెడ్డి కృష్ణారెడ్డి అంటున్నారు గ్రామస్తులు..అయితే ఇదే విషయంపై.. ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలు, దారెడ్డి కృష్ణారెడ్డి ఇటీవల పోలీస్ స్టేషన్ లో కలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ లోనే గ్రామ పెద్దల సమక్షంలో 3 నెలల్లో రూ.85 లక్షలు దారెడ్డి కృష్ణా రెడ్డి ఇస్తానని బాండ్ రాసిచ్చాడు. అయితే తాజాగా మాట మార్చి తిరిగి ఒక్కో ప్లాటుకు మరో రూ. 4 లక్షలు ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తానని, నయా దందాకు తెరలేపి గ్రామంలో ప్రశ్నించిన పెద్దవారిపై కేసులు పెట్టిస్తున్నాడని గ్రామస్తులు మండిపడుతున్నారు. కష్టపడి పైసా పైసా కూడబెట్టుకుని ప్లాట్లు కొని 20 ఏండ్ల క్రితమే ఇల్లు కట్టుకుని జీవనం సాగిస్తున్నామని.. అయితే రాందాస్ మోహన్ గౌడ్, వెంకట్ గౌడ్, దారెడ్డి కృష్ణారెడ్డి అనే త్రిమూర్తులు కుమ్మకై తమని శతవిధాలా ఇబ్బందులు పెడుతున్నారని గ్రామస్తులు శుక్రవారం తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మా గ్రామానికి చెందిన దారెడ్డి కృష్ణారెడ్డే కేసులు పెట్టించి కోర్టులు చుట్టు తిప్పుతుంటే మేం ఊర్లో ఉండాల్నా.. చావాల్నా.. అని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా మాకు వెంటనే న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు..