Sunday, October 13, 2024
spot_img

టీటీడీకి వాహనం విరాళం..

తప్పక చదవండి

తిరుమల బెంగళూరుకు చెందిన కోదండ రెడ్డి అనే శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుడు రూ.14 ల‌క్షల విలువైన ఫోర్స్ ట్రావెలర్ వాహనాన్ని గురువారం విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ‌వారి ఆల‌యం ఎదుట పూజ‌లు నిర్వహించి, వాహ‌నం తాలూకు తాళలను, డాకుమెంట్లను ఈవో ఏవి ధర్మారెడ్డికి దాత అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల డీఐ జానకిరామిరెడ్డి, అన్న ప్రసాదం ప్రత్యేకాధికారి శాస్త్రి పాల్గొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న స్వామివారిని 77,299 మంది దర్శించుకోగా 30,479 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ .3.93 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వివరించారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు