Sunday, October 13, 2024
spot_img

కారోబార్ ప్రభాకర్ కుటుంబానికి అండగా కేటీఆర్..

తప్పక చదవండి

చిన్న వయసులోనే గుండెపోటుతో హఠాన్మరణం చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల కారోబార్ ప్రభాకర్ (35) కుటుంబానికి మంత్రి కేటీఆర్‌ అండగా నిలిచారు. వారి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీనిచ్చారు. గురువారం జిల్లాలోని వ్యవసాయ కళాశాలలో బాబు జగ్జీవన్ రామ్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి కేటీఆర్ ను ప్రభాకర్ భార్య జ్యోతి, పిల్లలు కలిశారు. తమను ఆదుకోవాలని మంత్రిని వేడుకున్నారు. ప్రభాకర్ మృతి బాధాకరమని, అనివార్య కారణాలతో పరామర్శకు రాలేకపోయానని జ్యోతికి వివరించారు. ఇదే వ్యవసాయ కళాశాలలో ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అక్కడే ఉన్న వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ సెక్రటరీ పీఎస్ శ్రీనివాస్ కు ఉద్యోగ భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

రెండు రోజుల్లోనే ఉద్యోగ నియామకానికి సంబంధించిన ఉత్వర్వులు వస్తాయని, ఇక్కడే పని చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకోవాలని మంత్రి సూచించారు. కొడుకుల చదువులకు సహాయం చేస్తానని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. మంత్రి కేటీఆర్ ఉద్యోగంతో పాటు పిల్లల చదువులకు అండగా ఉంటానని తెలుపడంతో జ్యోతి తో పాటు సర్పంచ్ మాట్ల మధు, స్థానిక నేతలు కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు