Saturday, May 4, 2024

‘ప్రజా యుద్ధనౌక’ ప్రయాణాన్ని కొనసాగిద్దాం

తప్పక చదవండి
  • టివివి, డిటిఎఫ్, కెవిపిఎస్ నేతలు..

రాజ్య హింస పైన, ప్రజా సమస్యలపై ప్రజా ఆకాంక్షల కోసం రాజ్యంతో యుద్ధం చేసిన ప్రజా యుద్ధనౌక గద్దర్ ప్రయాణాన్ని కొనసాగిద్దామని డి.టి.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.సోమయ్య, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు అన్నారు. గద్దర్ అకాల మరణం సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద గద్దర్ చిత్ర పటం ముందు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్మరించుకోవడం జరిగింది..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన గళంతో ఉర్రూతలూగించి కోట్లాదిమంది ప్రజల అభిమానాన్ని చూరగొన్న ప్రజా ఉద్యమ గొంతుక మూగబోవడం తెలంగాణ సమాజానికి తీరని లోటు అన్నారు. నాలుగు దశాబ్దాల పోరాట జీవితంలో ఏనాడు కూడా పాలకులకు తలవంచ లేదన్నారు. గద్దర్ ఆడితే తెలంగాణ ఆడిందని, గద్దర్ పాడితే తెలంగాణ పాడిందని, గద్దర్ కదిలితే తెలంగాణ యావత్ సమాజం కదిలిందన్నారు.ఎంతోమంది కవులను, కళాకారులను తయారుచేసి తెలంగాణ ఉద్యమానికి అందించిన గొప్ప యోధుడు గద్దర్ అన్నారు. సాంస్కృతిక విప్లవోద్యమానికి గద్దర్ చేసిన మార్గ నిర్దేశం విప్లవ పోరాటాలలో మైలురాయి అన్నారు. అజ్ఞాతంలో ఉన్నా, ప్రజాక్షేత్రంలో ఉన్నా నిరంతరం ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు అన్నారు. తన జీవిత ప్రయాణంలో ఏ సమస్య ఎదురైనా ఆ సమస్యను పాట రూపంలోకి మలిచి ప్రజా చైతన్యాన్ని కూడగట్టడంలో గద్దర్ దిట్ట అన్నారు. రాజ్యం తుపాకితో కాల్చినా, హత్య చేయడానికి ప్రయత్నం చేసినా, సమాజంలో జరుగుతున్న ఆడపిల్లల హత్యల పైన, అత్యాచారాల పైన, దోపిడీ పీడల పైన గొంతు విప్పడంలో ఏనాడు వెనకంజ వేయలేదు అన్నారు. గద్దర్ హృదయం ఉద్యమాల హృదయముగా పేరుగాంచిందన్నారు. గద్దర్ పోరాట పఠిమను, వారి ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాల్సిన బాధ్యత రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజల పై ఉంధన్నారు.

- Advertisement -

గద్దర్ ఆకాంక్షించిన ప్రజాస్వామిక తెలంగాణ ప్రయాణాన్ని కొనసాగించాల్సిన బాధ్యత తెలంగాణలోని కవులు, కళాకారులు, మేధావులు, విద్యావంతులు, బుద్ది జీవులందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఖుర్షీద్ మీయా, పి.వెంకులు, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు, కార్యదర్శి పెరుమాల వెంకటేశం, టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు రత్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్ కాశయ్య, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు మానుపాటి బిక్షమయ్య, ఏఎం.ఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జ్ బొజ్జ చిన్న, ఎం.ఆర్.పి.ఎస్.జిల్లా కో-కన్వీనర్ ఇరిగి శ్రీశైలం, తెలంగాణ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కొండేటి మురళి, కత్తుల చందన్, సోహేల్, సామాజిక కార్యకర్త పలస యాదగిరి, డిటిఎఫ్ జిల్లా బాధ్యులు టి.వెంకటేశ్వర్లు, ఈద అంజయ్య, ఇమ్మడి జగతి, కె.విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు