Saturday, July 27, 2024

ఆమె చెప్పిందే రేటు.. లేదంటే వేటే..

తప్పక చదవండి
  • అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ నార్సింగి మున్సిపాలిటీ..
  • షెట్లర్ కు ఓ రేటు.. ఫ్లోర్ కు మరో రేటు..
  • హై టెన్షన్ వైర్ల కింద అక్రమ షెడ్ల నిర్మాణం..
  • ఫిర్యాదు చేసినా పట్టించుకోకొని టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారిణి..
  • జిల్లా టాస్క్ ఫోర్స్ కు ఫిర్యాదు అంటూ దాటవేత..
  • కొన్సిల్ కి తలనొప్పిగా మారిన పావనీ రావు వ్యవహార శైలి..
  • కౌన్సిల్ తీర్మానం చేసి పంపించేందుకు రంగం సిద్దమైనట్లు సంమాచారం..

ఆమె చెప్పిందే రేటు.. లేదా వేటే.. అనే కాన్సెప్ట్ తో నార్సింగ్ మున్సిపాలిటీలో సమాంతర పాలన రాజ్యమేలుతోంది.. జీరో అనుమతులతో సెల్లార్ కాకుండా ఆరు అంతస్థుల నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.. ఎవరైనా ఫిర్యాదు చేస్తే జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులకు (డీ.టి.ఎఫ్.) కూల్చేందుకు లెటర్లు పంపినట్లు టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారి పావని స్థానికులను మభ్యపెడుతూ అక్రమ సంపాదనకు తెగబడుతున్నట్లు బహిరంగ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.. సదరు అధికారి వ్యవహార శైలి కౌన్సిల్ కి సైతం తలనీప్పిగా మారటంతో తీర్మానం చేసి పంపించేందుకు రంగం సిద్దమైనట్లు సమాచారం..

రంగారెడ్డి జిల్లా, నార్సింగి మున్సిపాలిటీ కేంద్రంగా అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.. ఎటువంటి అనుమతులు లేనప్పటికీ సెల్లార్ కాకుండా ఆరు అంతస్తుల అక్రమ నిర్మాణాల వాళ్ళ గౌన్ ప్లానింగ్ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి.. సెల్లార్ కైతే పక్కా రెండు లక్షల రూపాయలు, ఫ్లోర్ కు ఏరియాను బట్టి రూ. 2.50 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు ప్రైవేట్ సైన్యాన్ని నియమించుకొని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఈ ప్రాంతంలో జోరుగా ప్రచారం సాగుతోంది.. అయితే హై టెన్షన్ వైర్ల కింద ఎటువంటి నిర్మాణాలకు అనుమతించారు.. కానీ ఇక్కడ టౌన్ ప్లానింగ్ అధికారి ప్రసన్నం లభిస్తే ఏమైనా నిర్మించుకోవచ్చు.. కార్ షెడ్లు, బహుళ అంతస్థుల నిర్మాణాలు వణుకు, బెరుకు లేకుండా నార్సింగ్ మున్సిపాలిటీ పార్కు సాక్షిగా ఇరు వైపులా అక్రమ నిర్మాణాలెన్నో ఆమె కనుసన్నల్లోనే సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.. ఒకటి, రెండో నోటీసులు అక్రమ నిర్మాణదారులకు జారీ చిన పిదప వారి వివరణ లభించక పోతే స్పీకింగ్ ఆర్డర్ జారీచేసి, కూల్చివేతలు చేపట్టాల్సి ఉంటుంది.. కానీ ఒక్క నోటిస్ లతోనే అక్రమ నిర్మాణదారులతో ములాఖత్ ఏమిస్తావ్ అంటూ బేరం ఆడటం.. అడిగినంత చెల్లించకుంటే జిల్లా టాస్క్ ఫోర్స్ కు రాస్తామని బెదిరించడంతో నయానో, భయానో ఇక్కడే సెటిల్ చేసుకుంటే మంచిది అని కాళ్ళ బేరానికి వచ్చినట్లు బాధితులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. మరోవైపు హై టెన్షన్ వైర్ల కింద ఓ ఆర్వాడీకి రెండుకోట్లకు దళారులు విక్రయించినట్లు బాహాటంగానే చర్చ సాగుతోంది..

- Advertisement -

ఇలాఉంటే కొరకగాని కొయ్యగా మారిన టౌన్ ప్లానింగ్ అధికారిణి పావనీ రావు వైఖరిపై ఎమ్మెల్య్, ఎంపీలకు సైతం ఫిర్యాదు అందడంతో.. వారు మందలించించినట్లు తెలిసింది.. వారి మాటలను సైతం బే ఖాతరు చేయడంతో స్థానిక కౌన్సిల్ సైతం విసిగి వేసారిపోయి, కౌన్సిల్ తీర్మానం చేసి పంపించేందుకు యత్నాలు జరుగుతున్నట్లు వారు పేర్కొంటున్నారు..

నర్సింగ్ కమిషనర్ సురేందర్ రెడ్డి వివరణ :
హై టెన్షన్ వైర్ల కింద ఏ 1 కార్ వాష్, మున్సిపల్ పార్క్ ముందు మరో షెడ్, ఐదు అంతస్థులతో పక్కనే నిర్మాణం సాగిస్తున్న రెండు నిర్మాణాలకు నోటీసులు జారీ చేయమని టౌన్ ప్లానింగ్ అధికార్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు.. మిగిలిన అక్రమ నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి కూల్చివేతలు చేస్తామన్నారు.. అక్రమ నిర్మాణాలను ఉపేక్షిచబోమని సురేందర్ రెడ్డి తెలిపారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు