- కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే లు గణేష్ బిగాల, బాజిరెడ్డి గోవర్ధన్..
ఈ కార్యక్రమంలో లో ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ… ఈ నెల 9వ తేదీన పలు అభివృద్ధి పనులను ప్రారంభించడానికి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వస్తున్నారు. ఐటీ హబ్, దుబ్బా, అర్సపల్లి, వర్ని రోడ్డు వైకుంటాదామలు, నూతన మున్సిపల్ భవనం, మినీ ట్యాంక్ బండ్ లను కేటీఆర్ ప్రారంభిస్థారు. శ్రీరామ గార్డెన్స్ లో మున్సిపల్ కార్మికులతో సహా పంక్తి భోజనం చేస్తారు. నిజామాబాద్ పాలి టెక్నీక్ గ్రౌండ్ లో బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. కావున బహిరంగ సభను విజయవంతం చేయగలరు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత సహకారంతో నిజామాబాద్ నగరం ఎంతో అభివృద్ధి చెందింది. కేసీఆర్ నిజామాబాద్ నగరానికి వచ్చినపుడు నగర ప్రజల మీద ప్రేమతో 100 కోట్ల రూపాయల నిధులు అభివృద్ధి పనులకు కేటాయించారు. 50 కోట్ల రూపాయలను కళాభారతి నిర్మాణానికి నిధులు కేటాయించారు. రాబోయే రోజుల్లో ప్రజల సహకారంతో నిజామాబాద్ నగరం మరింత అభివృద్ధి చేస్తామని మాటిస్తున్నాను అన్నారు.. ఈ సమావేశంలో బీ.ఆర్.ఎస్. పార్టీ ఎన్.ఆర్.ఐ. గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల, జడ్పీ చైర్మన్ విఠల్ రావు, వీజీ గౌడ్, బాజిరెడ్డి జగన్, ఎస్.ఏ. అలీం, సూదం లక్ష్మీ, బీ.ఆర్.ఎస్. కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.