Friday, May 17, 2024

కల్లుకు డిమాండ్.. వృత్తికి భద్రత.. అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది..

తప్పక చదవండి
  • ట్యాడీ కార్పొరేషన్ చైర్మన్, పల్లె రవి కుమార్ గౌడ్..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీతకు డిమాండ్ వృత్తికి భద్రత కార్మికుల సంక్షేమం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కల్లు గీతలో గీతకార్మికుల సమస్యలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకుపోయి పరిష్కారం దిశగా పనిచేస్తున్నామని తెలంగాణ కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ అన్నారు.

బుధవారం రోజు జనగామ జిల్లా, నెల్లుట్ల గ్రామంలో ఇటీవల వృత్తి ప్రమాదంలో గాయపడ్డ కల్లు గీత కార్మికుడు కుర్రేముల మధుసూధన్ కి ట్యాడి కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్, కే.జీ.కె.ఎస్. రాష్ట్ర అధ్యక్షులు ఎం.వీ. రమణ తక్షణ సహాయంగా 15000/- రూపాయల చెక్కు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కల్లుకు డిమాండ్, వృత్తి రక్షణ, వృత్తి అభివృద్ధి కోసం కృషి చేస్తామని అన్నారు. త్వరలో ప్రభుత్వం ప్రమాదాల నివారణకు సేఫ్టీమోకులు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నదని తెలిపారు. అలాగే సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేశారు. పాపన్న కీర్తిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని దానికోసం పాపన్న జయంతిని, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే కార్యక్రమాన్ని చేపట్టిన విషయం అందరికీ తెలుసు అని, భవిష్యత్తులో పాపన్న ఆశయాన్ని మరింత ముందుకు తీసుకు పోవడం కోసం మనమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో కే.జీ.కె.ఎస్. రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి, జిల్లా కార్యదర్శి బాల్నే వేంకట మల్లయ్య, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ సురుగు రాజేష్, జిల్లా కమిటీ సభ్యులు బస్వాగాని మహేందర్, వెంకటేష్, సొసైటీ అధ్యక్షులు కొయ్యడ రామలింగం, కొయ్యడ చంద్రయ్య, కోయ్యాడ చిన్న సోమయ్య, అంబాల యాదగిరి, బెల్లంకొండ సోమనాథం, కొయ్యడ నరసయ్య, కరెముల రఘు, లక్ష్మీనారాయణ, కోతి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు