Saturday, July 27, 2024

కాసులు ఇస్తే కానీ కదలని ఫైలు..

తప్పక చదవండి
  • హనుమకొండ కలెక్టరేట్ లో ఓ అధికారి వింత పొగడ
  • సార్ అంగీకరిస్తేనే కలెక్టర్ టేబుల్ మీదకి ధరణి ఫైలు
  • కాసులు ఇస్తే ఎస్సు….. లేకుంటే వాపసు
  • శంకరా మార్చుకోరా! మీ తీరు

ధరణితో అవస్థలు పడుతున్న సామాన్యులకు హనుమకొండ కలెక్టర్ కార్యాలయం అంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకునే “ధరణి పోర్టల్ ” అధికారుల పాలిట వరంగా, సామాన్యులకు శాపంగా మారింది. దేవుడు కనికరించినా పూజారి వరం ఇవ్వడు.. అన్న మాదిరిగా హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో ఓ అధికారి తీరు పలువురిని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఆ అధికారి ఫైనల్ చేస్తేనే ఫైలు కలెక్టర్ టేబుల్ మీదకు వెళుతుంది. ఇదే అదునుగా భావించిన ఆ అధికారి తన కిందిస్థాయి అధికారి ఒకరిని కలుపుకొని వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారు. రైతుల తమ పట్టా పాసుబుక్ ల కోసం, పాస్ బుక్ లోని సవరణల కోసం, డిజిటల్ సైన్ పెండింగ్ సర్వేనెంబర్ మిస్సింగ్ ల నిషేధిత జాబితాలో పడిన భూములకు పాస్ బుక్కులు ఇప్పించుకోవడం, కోసం మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటారు. తాసిల్దార్ కార్యాలయంలో ఫిజికల్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ధరణి కన్న ముందున్న పహానిలు, ఖస్ర పహానిలు, సేత్వార్ పహానీలు, తదితర భూ రికార్డులు ఆర్ఐ, తాసిల్దార్ రిపోర్టు జతపరిచి ఆర్డీవోకు ఫైల్ పంపిస్తారు. అక్కడి నుండి కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంటుంది.. ఇక్కడ మాత్రం ఆ ఇద్దరు అధికారుల కనుసైగల్లోనే ఫైల్ కదులుతుంది.. కాసులు ఇచ్చినవారి ఫైల్ ఎస్ అని, లేదంటే దరఖాస్తుకు తిరకాసు పెట్టి వాపసు పంపిస్తారు. వాస్తవానికి ధరణి నిబంధన ప్రకారం రైతులు సమస్యలపై మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే, రెవెన్యూ అధికారులు రికార్డులను పరిశీలించి, ఎటువంటి దరఖాస్తు లేకుండానే సరిచేయాల్సిన బాధ్యత రెవిన్యూ అధికారిలపైన ఉంది. కానీ అందుకు విరుద్దంగా డాకుమెంట్స్ పెండింగ్ ఉందని, వెరిఫికేషన్ రిపోర్ట్ లేదని సాకు చెబుతూ ఫైల్ తిప్పిపంపిస్తున్నారు. కాసులు ఇస్తే ఫైల్ ఓకే చేసి పంపిస్తూ.. భూమి మార్కెట్ విలువను బట్టి వేలల్లో, లక్షల్లో దండుకుంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫైల్ మొత్తం తయారు చేసి పంపించేది రెవెన్యూ అధికారులు, అయినా ఈ తిరకాసులు ఏంటని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జోడెడ్ల బండిల ఈ ఇద్దరు అధికారుల పని మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుందని.. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ వీరిపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు