Thursday, May 2, 2024

విజయ భాస్కర్ కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రదానం..

తప్పక చదవండి

కవి, రచయిత, వక్త, పత్రిక సంపాదకులు, తెలుగు పండితులు డాక్టర్. ఎస్. విజయ భాస్కర్ కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ఆలూరి కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రావడంతో, బుధవారం నాడు పురానాపూల్ ఎస్వీ నగర్ లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల అఫ్జల్ గంజ్ ప్రధానోపాధ్యాయురాలు పద్మజా కుమారి, ఇతర ఉపాధ్యాయులు అభినందించారు. డాక్టర్.ఎస్. విజయ భాస్కర్ వృత్తి రీత్యా ప్రభుత్వ తెలుగు పండితులుగా చేస్తూ, ప్రవృత్తి రీత్యా సాహిత్య, సామాజిక రంగాల్లో చురుకైన పాత్రను నిర్వహిస్తున్నారనే విషయాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు హరిశంకర్, శివశంకర్, అశోక్ బాబు, సుచరిత, బబిత, కౌసర్ ఫాతిమా, పి.ఇ.టి. ఎన్.శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు. విజయ భాస్కర్ కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రదానం చేసిన వారు తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నాళేశ్వరం శంకర్, ప్రముఖ సినీ కవి వడ్డే పల్లి కృష్ణ, ఆలూరి కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు విల్సన్, ప్రముఖ సినీ నటుడు శంకర్ నారాయణ ఇంకా అనేక మంది సాహిత్య, సాంస్కృతిక, సినీ ప్రముఖులు ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు