Saturday, May 18, 2024

నేడు ప్రపంచ మానవతా దినోత్సవం

తప్పక చదవండి

ఈ సృష్టిలో ప్రాణమున్నవి రెండే రెండు. ఒకటి మొక్కలు, రెండు జంతువులు. జీవశాస్త్రం సిద్ధాంతాల ప్రకారం మనిషి కూడా జంతువే…! మరి మనిషిని జంతువుల నుండి వేరు చేసే గుణం ఏమిటి..? జంతువులు, మానవుడు ఈ రెండు ప్రాణులూ వాటి వాటి పరిధులలో జ్ఞానం , ఆలోచనలు కలిగి ఉన్నవే…! మరి ఎం దులో తేడా చూపిస్తాయి ? పరిశీలిస్తే వాటి తత్వాలలో తేడా చూపుతాయి అని చెప్పొచ్చు. జంతువులకు ఉండే తత్వం పశుతత్వం. మానవునికి ఉండే తత్వం ‘‘మానవత్వం’’. ప్రపంచంలో ఎన్ని తత్వాలున్నా మానవత్వానికి మించినతత్వం లేదు. మానవ త్వానికి మించిన మతం లేదు. మానవత్వం అంటే మన తోటి మనుషుల పట్ల జాలి,కరుణ ,దయ, ప్రేమ కలిగి ఉండ డమే. ఉన్నోడికి, లేనోడికి ఆస్తులలో తేడా ఉండవచ్చేమో గానీ ఇద్దరికీ ఆకలి మాత్రం సమానమే. గురజాడ గారు చెప్పినట్లు… సొంత లాభం కొంత మానుకు, పొరుగు వాడికి తోడుపడవోయి, ఇంకా ఆయనే అన్నట్లు మనిషి చేసిన రాయి రప్పకి మహిమ కలదని సాగి మొక్కుతు, మనుషులంటే రాయి రప్పల కన్న కనిష్టం గాను చూస్తా వేల, బేలా? దేవుడెక డో దాగెనంటూ కొండ కోనల వెతుకు లాడే వేలా? కన్ను తెరిచిన కానబడడో? మనిషి మాత్రుడి యందు లేడో? యెరిగి కోరిన కరిగి యీడో ముక్తి? అలాగే శ్రీశ్రీ అన్నట్లు మానవాళికి నిజంగానే మంచి కాలం రహిస్తుం దా? దారుణ ద్వేషాన్ని పెంచే దానవత్వం నశిస్తుందా? సాధు సత్వపు సోదరత్వపు స్వాదు తత్వం జయిస్తుందా..! ఇంకా సినారె తెలిపిన ట్లు ‘ఏ కులము వెన్నెలది? తెమ్మెద లెట్టి జాతికి చెందినట్టివి అట్టిదే కద మానవ త్వము అన్నిటికి ఎత్త్తెన సత్వము..! అందరి భావం ఒక్కటే అదే మనుషులందరూ మానవత్వం కలిగి ఉండాలనే చెప్పారు. నేటి మనిషిలో మానవత్వం తగ్గుతుంది. ధనతత్వం పెరుగు తుంది. ‘మని’షి మనీ సంపాదన మీద ఎక్కువ దృష్టి పెడుతు న్నాడు. డబ్బుకోసం దగాలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, చివరికి హత్యలు చేయడానికైనా వెనుకాడడం లేదు. డబ్బుకి ఇచ్చే ప్రాధాన్యత తోటి మనుషులకు ఇవ్వడం లేదు. ఆస్తుల కోసం, అంతస్తులకోసం స్వంత వారని కూడా చూడడం లేదు. ఎంతటి ఆకృత్యానికైనా వెనుకాడడం లేదు. కులాల మధ్య కొట్లాటలు, మతాల మధ్య మారణహోమాలు జరుగుతూనే ఉన్నాయి. బలహీనుడుని, బలము న్నోడు దోచేస్తు న్నాడు. సాయం చేసే గుణం రోజు రోజుకీ తగ్గిపోతుంది. కష్టాలలో ఉన్న వారిని ఆదుకోవడం లేదు. ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టడం లేదు. చచ్చిన తరు వాత ఎవరూ వారితో పాటుగా యేమీ తీసుకు పోరు. ప్రపంచాన్ని జయిం చిన అలగ్జాండర్‌, ఈ కాలం కుబేరు డైన ఆపిల్‌ కంపెనీ సృష్ఠికర్త స్టీవ్‌ జాబ్స్‌, కోట్లు గడిరచిన లతా మంగేష్కర్‌ వారి వారి చివరి రోజులలో చెప్పిన మాటల సారాంశం ‘‘ఎవరికీ ఏ సాయం చేయలేని ధనం, ఆస్తులు, పదవీ ఉన్నా అంత్య దశలో ఏమీ ఉప యోగపడవు. ఉపయో గపడని వాటి విలువ ఇవ్వకండి. ముఖ్యంగా మంచి మనస్సు ఉన్నవారికి విలువ నిచ్చి అందరికీ స్నేహం, ఆప్యా యతా ప్రేమ చూపించండి’’ అని మన చుట్టూ ఎందరో అనాధ లు, అభాగ్యులు, పేదలు, త్రాగడా నికి పాలు లేని పసికం దులు, ఇంకా ఇలాంటి వారు ఎందరో ఉన్నారు. అందుకే మన మంద రం అభాగ్యులనుఆదుకొందాం. తోటిమనిషి కి సాయం చేద్దాం. మానవత్వం చూపుదాం. మనుషులం అనిపించుంకుందాం…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు