Monday, April 29, 2024

సుప్రీంకు రాహుల్‌

తప్పక చదవండి
  • గుజరాత్‌ హైకోర్టులో రాహుల్‌ గాంధీకి చుక్కెదురు
  • సూరత్‌ ట్రయల్‌ కోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ
  • తీర్పుసరైనదేనని వ్యాఖ్యానించిన హైకోర్టు
  • ఇక సుప్రీంలో అప్పీల్‌ చేసుకునే అవకాశం

అహ్మదాబాద్‌ : గుజరాత్‌ హైకోర్టులో రాహుల్‌ గాంధీకి చుక్కెదురైంది. మోదీ ఇంటి పేరుతో రాహుల్‌ వ్యాఖ్యలు చేసిన కేసులో అతనికి రెండేళ్ల శిక్ష పడిన విషయం తెలిసిందే. ఆ కేసులో రాహుల్‌ గాంధీ తన ఎంపీ స్టేటస్‌ను కోల్పోయారు. అయితే సెషన్స్‌ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ పరువునష్టం కేసులో రాహుల్‌ గాంధీ గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సమర్థించింది. సూరత్‌ ట్రయల్‌ కోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు గుజరాత్‌ హైకోర్టు నిరాకరించింది. దీంతో రాహుల్‌ గాంధీ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోయారు. అయితే ఈ కేసు విషయంలో రాహుల్‌ గాంధీ సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉంది. మోదీ ఇంటిపేరు’ కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి గుజరాత్‌ హైకోర్టులో ఊరట లభించలేదు. సూరత్‌ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. సూరత్‌ సెషన్స్‌ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. ఆయన దోషి అని ఇచ్చిన తీర్పు అమలును నిలిపేసేందుకు కూడా నిరాకరించింది. దీంతో ఆయనకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇక ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించవలసి ఉంటుంది. హైకోర్టు నిర్ణయంతో రాహుల్‌ గాంధీపై లోక్‌సభ సభ్యత్వానికి అనర్హత కొనసాగుతుంది. ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉండదు. ఇదిలావుండగా, ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సెషన్స్‌ కోర్టు తీర్పుపై రాహుల్‌ గాంధీ అపీలును విచారించిన హైకోర్టు తీర్పు చెప్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. రాహుల్‌ గాంధీపై ప్రస్తుత కేసు మాత్రమే కాకుండా మరికొన్ని ఇతర కేసులు కూడా దాఖలయ్యాయని తెలిపింది. వీర్‌ సావర్కర్‌ మనుమడు దాఖలు చేసిన కేసు అటువంటి వాటిలో ఒకటి అని గుర్తు చేసింది. ఆయనపై ఎనిమిది క్రిమినల్‌ పరువు నష్టం కేసులు నమోదై, విచారణలో ఉన్నాయని పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ, ఆయనను దోషిగా నిర్థరిస్తూ ఇచ్చిన తీర్పు ఏ విధంగానూ అన్యాయమైనది కాదని, ఈ తీర్పులో జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది. గాంధీ అపీలును దానిలోని యోగ్యతల ఆధారంగా సాధ్యమైనంత త్వరగా విచారించి, తీర్పు చెప్పాలని సెషన్స్‌ కోర్టును ఆదేశించింది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో బహిరంగ సభలో మాట్లాడుతూ, దొంగలందరి ఇంటి పేరు మోదీ ఎలా అవుతోందని రాహుల్‌ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గుజరాత్‌కు చెందిన పూర్ణేశ్‌ మోదీ సూరత్‌ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసులో ఆయన దోషి అని కోర్టు గత మార్చి 23న తీర్పు చెప్పింది, ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దోషిగా నిర్థరణ అయిన వ్యక్తి చట్టసభల సభ్యునిగా కొనసాగడానికి చట్టం అంగీకరించదు కాబట్టి ఆయన వయనాద్‌ లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడని లోక్‌సభ సచివాలయం మార్చి 24న ప్రకటించింది. ఈ కోర్టు తీర్పు అమలును నిలుపుదల చేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ సూరత్‌ సెషన్స్‌ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను సెషన్స్‌ కోర్టు ఏప్రిల్‌ 20న తిరస్కరించింది. దీంతో ఆయన ఏప్రిల్‌ 25న గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయనకు తాత్కాలిక ఉపశమనం కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. వేసవి సెలవుల తర్వాత తీర్పు చెబుతామని తెలిపింది

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు