Wednesday, May 15, 2024

గీతాప్రెస్‌ది ఆధ్యాత్మిక సేవ

తప్పక చదవండి
  • నమ్మిన సిద్దాంతం కోసం కృషి
  • శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోడీ కితాబు
  • నేపాలీ భాషలో ప్రచురించిన పురాణాల ఆవిష్కరణ
  • గోరఖ్‌పూర్‌లో రెండు శతాబ్ది ఎక్స్‌ప్రెస్లకు జెండా
  • నమ్మిన సిద్దాంతం కోసం కృషి
  • శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోడీ కితాబు
  • నేపాలీ భాషలో ప్రచురించిన పురాణాల ఆవిష్కరణ
  • గోరఖ్‌పూర్‌లో రెండు శతాబ్ది ఎక్స్‌ప్రెస్లకు జెండా

లక్నో : ప్రపంచంలోనే కేవలం ఒక సంస్థగానే కాకుండా నమ్మిన సిద్దాంతాల కోసం జీవిస్తున్న ఏకైక ప్రింటింగ్‌ ప్రెస్‌ ’గీతా ప్రెస్‌’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. అలాగే ఆధ్యాత్మిక సేవలు చేస్తోందని చెప్పారు. గీతా ప్రెస్‌ అనేది ప్రింటింగ్‌ ప్రెస్‌ మాత్రమే కాదని, కోట్లాది మంది ప్రజలకు దేవాలయమని కొనియాడారు. ప్రెస్‌ పేరులో గీత ఉందని, గీత కోసమే పనిచేస్తోందని అభినందించారు. గీతాప్రెస్‌ శతాబ్ది ఉత్సావాల ముగింపు సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని గొరఖ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని శుక్రవారంనాడు పాల్గొన్నారు. గీతా ప్రెస్‌ నేపాలీ భాషలో అనువదించిన శివపురాణం, మహాశివపురాణం పుస్తకాలను ఈ సందర్భంగా మోడీ ఆవిష్కరించారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి సారథ్యంలోని జ్యూరీ ఇటీవల 2021 సంవత్సరానికి గాను గీతాప్రెస్‌కు గాంధీ శాంతి బహుమతిని ప్రకటించింది. ఈ బహుమతి కింద కోటి రూపాయల నగదు, మెమెంటో ప్రదానం ఉంటుంది. అయితే, విరాళాలు తీసుకోవడం తమ సంప్రదాయం కాదని, తదనుగుణంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని తాము అంగీకరించడం గీతాప్రెస్‌ సున్నితంగా నిరాకరించింది. ఉత్తరప్రదేశ్‌ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి తన నియోజక వర్గమైన వారణాసిలోనూ పలు కార్యక్రమాల్లో శుక్రవారం పాల్గొన్నారు. గోరఖ్‌పూర్‌ ర్వైలే స్టేషన్‌ నుంచి గోరఖ్‌పూర్‌లక్నో, జోధ్‌పూర్‌అహ్మదాబాద్‌ వందేభారత్‌ రైళ్లను ప్రారంభించారు. రూ.498 కోట్ల వ్యయంతో గోరఖ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ రీడవలప్‌మెంట్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసారు. వివిధ ప్రాజెక్టులను జాతికి అంకితం చేసారు. గోరఖ్‌పూర్‌లో మరో రెండు వందేభారత్‌ రైళ్లను ప్రారంభించారు. గోరఖ్‌పూర్‌ లక్నో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌, జోధ్‌పూర్‌ అహ్మదాబాద్‌ (సబర్మతి) వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను జెండా ఊపి మోడీ ప్రారంభించారు. దీంతో దేశవ్యాప్తంగా వందే భారత్‌ రైళ్ల సంఖ్య 25కి చేరిందని కేంద్ర ప్రభుత్వ అధికారిక ట్వీట్‌లో పేర్కొంది. గాంగా, గోరఖ్‌పూర్‌ లక్నో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ బాబా గోరఖ్‌నాథ్‌, లార్డ్‌ రామ్‌, అయోధ్య, నవాబ్స్‌ నగరాల మీదుగా లక్నోకి కలుపుతుంది. వీటితోపాటు 15వ శతాబ్దపు ఆధ్యాత్మిక కవి కబీర్‌ పట్టణం, సిద్దార్థ్‌నగర్‌, సంత్‌ కబీర్‌నగర్‌ వంటి పర్యాటక ప్రదేశాలకు వెళ్లే ప్రయోజనం ఉంది. ఇక జోధ్‌పూర్‌ `సబర్మతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రాజ్‌పుతానా, అహ్మదాబాద్‌ నగరాలకు కనెక్టివిటీ ఉంది. ఈ రైలు మార్గంలో పాలి, అబు రోడ్‌, పాలన్‌పూర్‌, మెహసానా నగరాలను కలుపుతుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు