Thursday, October 10, 2024
spot_img

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం..

తప్పక చదవండి

వేసవి సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతుంది. కొండపై ఉన్న కంపార్ట్‌మెంట్లు నిండిపోగా కృష్ణతేజ గెస్ట్‌హౌజ్‌ వరకు భక్తులు బారులు తీరి ఉన్నారు. నిన్న స్వామివారిని 88,604 మంది భక్తులు దర్శించుకోగా 51,251 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడోరోజు ఆదివారం శ్రీ గోవిందరాజస్వామి సింహ వాహనంపై దర్శనమిచారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తలు కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ జరిగింది.

అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. సాయంత్రం ఊంజల్‌సేవను, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారని అర్చకులు వెల్లడించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు