- బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం..
- 5 గురికి తీవ్ర గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం..
ఏపీలోని నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మూముడూరు గ్రామం బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలను అగ్నిమాపక అధికారులు, పోలీసులు విచారణ ప్రారంభించారు. అనుమతులు లేకుండా బాణసంచా కేంద్రం నిర్వహిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.