- కోట్లాది రూపాయలు అప్పనంగా కొట్టేసిన జీ.వీ.పీ.ఆర్. కంపెనీ చైర్మన్ జీ.ఎస్.పీ. వీరారెడ్డి..
- అంతులేని అవినీతిలో సంబంధిత అధికారుల భాగస్వామ్యం..
- పరీక్షలు చేయకుండానే చేసినట్లు సర్టిఫికేట్ ఇచ్చి బిల్లుల విడుదల..
- ఉపయోగకరమైన పథకాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వ ఆశయానికి తూట్లు..
- సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగుచూసిన భయంకర నిజాలు..
మంచినీళ్లు తాగయినా ప్రాణాలు నిలుపుకుందామని ఎంతోమంది ఆశతో చూస్తుంటారు.. అలాంటి వారి దాహార్తిని తీర్చడానికి తెలంగాణ ప్రభుత్వం మహత్తరమైన పథకాన్ని తీసుకుని వచ్చింది.. ఎండిపోతున్న గొంతులను తడపాలి విశ్వప్రయత్నం చేస్తున్న సర్కార్ కి వెన్నుపోటు పొడుస్తున్నారు కొందరు దుర్మార్గులు.. ఈ అవినీతి భాగోతంలో అధికారులు సైతం భాగస్వాములు కావడం నిజంగా శోచనీయం.. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మిషన్ భగీరథ అత్యున్నత ఆశయాన్ని నీరుగారుస్తున్నారు.. కిష్ణానది నుంచి ప్రజలకు సరఫరా చేయవలసిన మంచినీటి కాంట్రాక్ట్ ను అవినీతిమయం చేస్తూ.. కోట్ల రూపాయల టెండర్ ను కొల్లగొట్టిన జీ.వీ.పీ.ఆర్. సంస్థ చైర్మన్ జీ.ఎస్.పీ. వీరారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ శేఖర్ రెడ్డి, డైరెక్టర్ శివశంకర్ రెడ్డిల విపరీత ధనదాహం వెలుగుచూసింది.. నల్గొండ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.. ఈ వ్యవహారాన్ని ఆదాబ్ హైదరాబాద్ వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే.. కాగా నల్గొండ జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల ప్రజల దాహార్తిని తీర్చే తెలంగాణ డ్రింకింగ్ వ్వాటర్ సప్లై ప్రాజెక్టు ద్వారా అంతులేని అవినీతిని మూటకట్టిన జీ.వీ.పీ.ఆర్. సంస్థ చేసిన భాగోతం సంచలనం సృష్టిస్తోంది.. ఆర్.టి.ఐ. ద్వారా అందిన సమాచారం విస్తుపోయేలా చేస్తోంది..
హైదరాబాద్, 15 ఆగస్టు ( ఆదాబ్ హైదరాబాద్ ) :
నల్గొండ జిల్లాలోని, నాలుగు నియోజక వర్గాలకు మంచినీటి సరఫరా కోసం.. మిషన్ భగీరథ ద్వారా టేల్ పాండ్ ( కృష్ణానది ) ద్వారా అందించడానికి టెండర్ పిలిచారు.. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు పథకం ద్వారా ఈ ప్రక్రియ చేపాట్టాల్సి ఉంటుంది.. అయితే టెండర్ ను పొందిన సంస్థ జీ.వీ.పీ.ఆర్. ఇంజినీరింగ్ లిమిటెడ్, జూబిలీ హిల్స్, హైదరాబాద్ వారు ప్రభుత్వం రూపొందించిన నియమ నిబంధనల ప్రకారం సబ్ కాంట్రాక్టు ఎవరికీ ఇవ్వకూడదు.. కానీ వాటిని అతిక్రమించి సబ్ కాంట్రాక్టర్లను నియమించుకుని, నాశిరకం పనులు చేపట్టిన విషయం కూడా ఆదాబ్ ప్రచురించింది..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజలందరికీ త్రాగునీరు అందించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించిన మిషన్ భగీరథ వాస్తవంగా గొప్ప ఆలోచన, దేశంలోనే ఉన్నతమైన ప్రాజెక్ట్.. కానీ స్వార్థపరులైన అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రజలకు నాణ్యమైన త్రాగునీరు అందే పరిస్థితి లేకపోవడం శోచనీయం. కృష్ణానది టెల్ పాండ్ నుండి రా వాటర్ ను 1.7 మీటర్ల వెడల్పు కలిగిన ఎమ్ ఎస్ పైప్ ద్వారా 6 నుండి7 కేజీల ప్రెజైర్ తో హైడ్రో టెస్ట్ చేసి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కు పంపించాలి. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లో రా వాటర్ ను టోటల్ దిసాల్వేడ్ సాలీడ్స్ ( టి.డీ.ఎస్. )పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది.. ఈ ప్రక్రియలో స్పెసిఫిక్ గ్రావిటీ, డెన్సిటీ, ప్రతి 24 గంటలకు మంచి నీటి నాణ్యత ప్రమాణాలపై పర్యవేక్షిస్తారు.. అదే విధంగా కెమిస్ట్ ద్వారా క్వాలిటీ కంట్రోల్ చెక్ చేయాలి అనే నిబంధన ఉన్నప్పటికీ జీ.వీ.పీ.ఆర్. సంస్థ ఎలాంటి నాణ్యత ప్రమాణాలు చేయకుండానే నీటిని విడుదల చేశారు.. చేయని హైడ్రో టెస్టు చేసినట్లు అధికారులు సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది.. ఈ విస్తుపోయే వాస్తవాలు సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగు చూశాయి.. కాగా హైడ్రో టెస్ట్ చేస్తే పైప్ లైన్ నాణ్యత తెలుస్తుంది.. కానీ హైడ్రో టెస్ట్ చేయిచాకుండానే బిల్లులు తీసుకోవడం జరిగింది.. పూర్తి ప్రాజెక్టు విలువ దాదాపు రూ. 1450 కోట్లు.. అధికారులు ఈ అవినీతిలో భాగస్వామ్యం అయ్యారన్నది నిర్విదాంశం.. అయితే సబ్ కాంట్రాక్ట్ ఇవ్వకూడదని నిబంధన ఉన్నప్పటికీ సదరు సంస్థ దానిని ఉల్లంఘించింది.. కోట్ల రూపాయల పనులు సబ్ కాంట్రాక్టర్ల ద్వారా పూర్తి చేయడమే కాకుండా.. వారికి చెల్లించే బిల్లుల్లో టి.డీ.ఎస్. సైతం మినహాయించి బిల్ సిద్ధం చేశారు.. అయితే ఈరోజుకు కూడా వారికి బిల్లులు చెల్లించలేదని ఆరోపణలు సైతం ఉన్నాయి..
అయితే ఇందులో ఒక భయంకరమైన మోసం దాగివుంది.. ఒక సబ్ కాంట్రాక్టర్ ఉదాహరణకు కోటి రూపాయల వర్క్ చేసినట్లయితే ఆ సబ్ కాంట్రాక్టర్ రెండు కోట్ల రూపాయల వర్క్ చేసినట్లుగా నకిలీ బిల్లులు సృష్టించి పూర్తి రెండుకోట్ల రూపాయలకు టి.డీ.ఎస్. చెల్లించడం జరుగుతోంది.. టి.డీ.ఎస్. చెల్లింపులను అడ్డం పెట్టుకుని బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది.. ఇంత తతంగం జరుగుతున్నా సంబంధిత ప్రభుత్వ అధికారులు, తమకు ఫిర్యాదులు అందుతున్నా సదరు బడా కాంట్రాక్టర్ ఇస్తున్న లంచాలకు తలొంచి అవన్నీ పట్టించుకోవడం లేదనే విమర్శలు హల్ చల్ చేస్తున్నాయి..
కాగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లో రా వాటర్ ను టోటల్ దిసాల్వేడ్ సాలీడ్స్ (టి.డీ.ఎస్.) పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది.. ఈ ప్రక్రియలో స్పెసిఫిక్ గ్రావిటీ, డెన్సిటీ, ప్రతి 24 గంటలకు మంచి నీటి నాణ్యత ప్రమాణాలపై పర్యవేక్షిస్తారు.. అదే విధంగా కెమిస్ట్ ద్వారా క్వాలిటీ కంట్రోల్ చెక్ చేయాలి అనే నిబంధనను ఉల్లంఘిస్తూ తాగు నీటిని సరఫరా చేయడం వల్ల ఆ నీటిని వినియోగించిన సామాన్య ప్రజానీకానికి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి..
ఇదే వ్యవహారంపై ప్రభుత్వ అధికారులైన ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ కృపాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వంశీకృష్ణ లను వివరణ కోసం సంప్రదించగా సమాధానం చెప్పకుండా దాటవేసే ధోరణి ప్రదర్శించారు.. బడా కాంట్రాక్టర్ అయిన జీ.వీ.పీ.ఆర్. కంపెనీ చైర్మన్ జీ.ఎస్.పీ. వీరారెడ్డి.. అతగాడికి సహకరించి బిల్లులు శాంక్షన్ అవడానికి హితోధికంగా ప్రయత్నం చేసిన సంబంధిత ప్రభుత్వ అధికారులపై విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదాబ్ డిమాండ్ చేస్తోంది.. అంతే కాకుండా దాహం తీర్చే మంచినీటి ప్రాజెక్టు వ్యవహారంలో ధనదాహానికి పాల్పడ్డ వారందరిపైనా దర్యాప్తు జరిపించాలి.. ప్రభుత్వ ఉన్నత ఆశయానికి గండికొడుతున్న వారు ఎంతటివారైనా ఉపేక్షించకుండా సర్కార్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆదాబ్ కోరుతోంది.. సబ్ కాంట్రాక్టర్ల వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీసింది.. వారిని సంతృప్తి పరచడానికి కొంతమేర బిల్లులు శాంక్షన్ చేయించడంలో ఎవరు ముఖ్యపాత్ర పోషించారు..? అసలు దీని వెనుక ఉన్న సీనియర్ పొలిటీషియన్ ఎవరు..? అతనికి జీ.వీ.పీ.ఆర్. కంపెనీకి ఏమిటి సంబంధం..? రిటైర్డ్ అయిన ఒక ఉన్నతాధికారి ఎలాంటి పాత్ర పోషించారు..? అన్న విషయాలపై మరో కథనం ద్వారా మీ ముందుకు రానుంది ‘ఆదాబ్ హైదరాబాద్’.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘…