Friday, April 26, 2024

మా “రాజు” కెసిఆర్ సార్..

తప్పక చదవండి

హైదరాబాద్, 09 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
నీరెండి, గోంతెండి, గుక్కెడు నీళ్ళ కోసం బిందెలతో బోరింగ్ నల్లాల దగ్గర భీభత్సమే.. కొలువులు అడిగేతే తెలంగాణోడివి నీకు కొలువు కావాలా అంటూ ఎకసెకలు..
పైసా అప్పు కావాలంటే గొడ్డు గోదా తాకట్టు పెట్టినా చీదరింపులు తప్పలేదు అన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్, బిఆర్ ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకురాలు, రాష్ట్ర అధ్యక్షులు : బీసీ మహిళా సంక్షేమ సంఘం. గుండ్రాతి శారదా గౌడ్..

నేడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో సమస్తం బదల్ గయా, ఉద్యమనాయకుడు కెసిఆర్ తెలంగాణా సీఎం అవ్వడం మా రోజులు మారాయి సాగునీరు, తాగునీరు, రైతులకు మహర్థశ రైతుబంధుతో ప్రాజెక్టులతో, మహిళలకు న్యూట్రిషన్ కిట్, కెసిఆర్ కిట్, కళ్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, గృహలక్ష్మి, ఆసరా, వికలాంగులకు డబల్ బెడ్ రూమ్ పథకం, యువతకు టీ – హబ్, వి-హబ్, బీసీ లకు కులవృత్తులకు చేదోడు, ఇరవై నాలుగు గంటల విద్యుత్, చెరువుల పునరుద్దరణతో భూగర్భ జలాల పెంపుతో నేడు తెలంగాణా సుభిక్షం. ప్రతి ఒక్కరి జేబులో పైసల గల గలలు.. తద్వారా ప్రజల కొనుగోలు శక్తిని పెంచిన తెలంగాణా కౌటిల్యుడు కెసిఆర్.. ఎప్పుడైనా ప్రజల చేతిలో డబ్బు ఉంటేనే కొనుగోలు శక్తి పెరిగి ఆర్థిక వ్యవస్థ గ్రాఫ్ స్థిరంగా ఉంటుంది. తెలంగాణా వస్తే ఏమి వచ్చింది అనే వాళ్ళు కళ్ళు పెద్దవి చేసి చూస్తే.. సామజిక హోదా, ఆర్థిక పరిపుష్టి, ఉచిత విద్యా, వైద్యం, ప్రతి జిల్లాకు ఆసుపత్రి, గురుకులాలు కనిపిస్తాయి.. తెలంగాణా ప్రపంచస్థాయిలో ఎగుమతులు చేసే స్థాయికీ ఎదిగింది కనిపిస్తుంది నిజంగా మా కెసిఆర్ మా రాజు అన్నారు గుండ్రాతి శారదా గౌడ్. ఈ కార్యక్రమంలో తనూ యాదవ్, సురేష్ కుమార్, భార్గవ్ గౌడ్ పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు