Tuesday, June 18, 2024

డ్ర‌గ్స్ కేసు నిందుతుడికి స్టేష‌న్ బెయిల్

తప్పక చదవండి
 • రెండో రోజు విచార‌ణ‌కు హాజ‌రయిన వెల‌గ‌పూడి ర‌ఘు..
 • గోవా ట్రిప్స్ పై ఆరా.?
 • రాత్రి ఇన్పినిటీకి ప‌బ్ కి వెళ్లి హడావుడి..
 • తెల్ల‌వారు జామున పోలీసుల త‌నిఖీలు..
 • పోలీసుల డ్రామాల న‌డుమ న‌డుస్తున్న డ్ర‌గ్స్ విచార‌ణ‌..
 • ‘ అదాబ్ హైద‌రాబాద్’ క‌థ‌నాల‌తోనే పోలీసుల్లో క‌ద‌లిక‌..
 • నెల రోజుల త‌ర్వాత విచార‌ణ చేయ‌డంపై పలు విమ‌ర్శ‌లు..
 • అరెస్ట్ చేస్తేనే సాక్షాదారాలు లభ్యమవుతాయంటున్న నిఫుణులు..
 • ఉన్నతాధికారుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించిన లోక‌ల్ పోలీస్ లు..
 • సిగ్గి భాయ్ కి కోట్ల రూపాయ‌ల స‌రుకు ఎక్క‌డిది.?
 • ఏడు వేల స‌రుకు రూ. 18 వేల‌కు అమ్మేంత స‌ర్కిల్ ఏ1 కి ఉందా..?
 • నెల‌కు రూ. 2 కోట్లు సంపాద‌న చూపించే ర‌ఘు తేజ‌ని వ‌ద‌ల‌డంపై అనుమానాలు.
 • సీపీ స్టీఫెన్ రవీంద్ర పేరు వాడకంతో మీడియాకు, పోలీసుల‌కు ద‌గ్గ‌ర‌ అనే కటింగ్..

అదాబ్ వార్త‌ల‌కు డ్ర‌గ్స్ ముఠా వెన్నులో వణుకు పుడుతోంది. మే 4న అరెస్ట్ అయినా.. డ్ర‌గ్స్ కేసులో రాయ‌దుర్గం పోలీసులు వ్య‌వ‌హారించిన తీరుపై వార్త‌లు రాసింది.. సక్సెస్ కిల్ల‌ర్ వెల‌గ‌పూడి ర‌ఘు తేజ అంటూ సంచ‌ల‌న వార్త ప్రచురించింది. దీంతో రెండు రోజులు నిఘా బృందాల‌తో ఆరా తీసిన ఉన్నతాధికారులు లోక‌ల్ పోలీసుల త‌ప్పిదాల‌ను ఎత్తి చూపార‌ని తెలుస్తోంది.. డ్ర‌గ్స్ కేసును కొట్ల‌ట కేసు కంటే ఈజీగా తీసుకోవ‌డంపై సీరియస్ విచార‌ణ చేప‌ట్టాల‌ని రాయ‌దుర్గం పోలీసుల‌కు అదేశాలు అందాయి. దీంతో ఎస్.ఓ.టీ. పోలీసులు మ‌ళ్లీ రంగంలోకి దిగి రాయ‌దుర్గం పోలీసుల‌కు నిందుతుడిని అప్ప‌గించారు. అయితే అంతా వెల‌గ‌పూడి ర‌ఘుతేజనే కారణభూతుడు అని వార్త‌లు వ‌చ్చినా.. పోలీసులు ఆ పేరును త‌ప్పించి.. క‌న్య్జుమ‌ర్ గా మార్చ‌డం వెన‌క అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి..

హైడ్రామా ఎంటంటే..?
డ్ర‌గ్స్ దందా అంతా డ‌బ్బున్న వారి చేతిలోనే ఉంటుంది. గోవాలో రూ. 7 వేల‌కు గ్రాము కొనుగోలు చేసి, ఇక్క‌డ 18 వేల నుంచి 20 వేల రూపాయలకు వ‌ర‌కు అమ్మేస్తారు. ఇదంతా ఈవెంట్ మేనేజ‌ర్స్, ప‌బ్స్, రెస్టారెంట్స్ న‌డిపించే వారే ఎక్కువ‌గా ఈ దందా చేస్తుంటార‌ని గ‌తంలో అరెస్ట్ అయిన స‌మ‌యంలో బట్టబయలు అయింది. ఈ సారి కూడా సిగ్గి భాయ్ వ‌ద్ద దొరికిన కొకైన్ తో కూపి లాగారు. గోవాలో ఉండే ఇద్ద‌రితో పాటు ఇక్క‌డ కింగ్ పిన్ గా ఉండే చింతా రాకేష్, గ‌జ్జల శ్రీనివాస్ రెడ్డిని ప్లేడ‌రర్ గా గుర్తించారు. అయితే వాడిన వారంతా హోట‌ల్ బిజినెస్ లోనే ఉండ‌టం.. రోజుకు కోట్ల బిజినెస్ చేస్తున్నా.. వారు స‌ప్లై దారుల‌ని గుర్తించ‌డంలో పోలీసులు వెన‌క‌డుగు వేశార‌ని తెలుస్తుంది. నార్సింగ్ వ‌ద్ద ఉండే ఎస్ఓటీ పోలీసులు 10 రోజుల పాటు వ‌చ్చి క‌లిసి వెళ్లాల‌ని అదేశించారు. దీంతో ప‌ది రోజుల పాటు ఎస్ఓటీ చుట్టు తిరిగారు. నిజానికి క‌న్జుమ‌ర్స్ అయితే ఎన్డీపీసీ యాక్ట్ సెక్ష‌న్ 27 ప్ర‌కారం వారికి డి- అడిక్ష‌న్ లో చికిత్స ఇప్పించాలి. ఎక్క‌డెక్క‌డ వినియోగించారో పూర్తి డాటా రాబ‌ట్టాలి. కాని ఆ దిశ‌గా నెల రోజులైనా సైబ‌రాబాద్ పోలీసులు గుర్తించ‌లేదు. ‘ అదాబ్ హైద‌రాబాద్ ‘ వార్త‌లు వ్రాయ‌గానే అల‌జ‌డి మొద‌ల‌యింది. అసలు నిజాలు ఏంటి..? ఎవరు ఎవరిని గోవాకు పంపించారు. ఎందుకు పంపించారు..? గోవాకి వెళ్లి డ్ర‌గ్స్ తీసుకునే వెల‌గ‌పూడి ర‌ఘు తేజ‌. హోట‌ల్ బిజినెస్ లోకి వ‌చ్చాక డ్ర‌గ్స్ దందాని న‌డిపించార‌ని అరోప‌ణ‌లు ఉన్నాయి. కానీ అనుమానాలు రాకుండా పోలీసుల‌కు, మీడియాకు అనేక విధాలుగా హెల్పింగ్ చేసేవార‌ని తెలుస్తోంది.. అత‌ని అకౌంట్స్ చిట్టా చూస్తే.. మాముళ్లు చాలా మందికే వెళ్లిన‌ట్లు స‌మాచారం. ఇవేమీ ప‌ట్టించుకోకుండా ఎస్ఓటీ పోలీసులు, రాయ‌దుర్గం పోలీసులు హైద‌రాబాద్ లో ఉండే ముగ్గురిని మాత్ర‌మే ప‌ట్టుకుని.. ఇదే పెద్ద మాఫియా అని చూపించారన్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

- Advertisement -

గోర్లు, వెంట్రుక‌ల ప‌రీక్ష‌లు ఏవి.. ?
డ్ర‌గ్స్ తీసుకునే వారు బాధితులే అని ఎన్డీపీసీ యాక్ట్ చెప్పుతుంది. కానీ అది టీనేజ‌ర్స్ కి , పూర్తిగా బానిస అయిన వారికి డీ-అడిక్ష‌న్ సెంట‌ర్స్ కి పంపిస్తారు. కానీ ఇక్క‌డ నెల‌కు రూ. 2 కోట్ల లాభాల‌తో న‌డిచే హోట‌ల్ య‌జ‌మాన్యం ఉందంటే.. ఎంత పెద్ద ఎత్తున ఈ దందా కొన‌సాగిందో తెలియ‌డం లేదు. వీరికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించి.. ఎంత మోతాదు తీసుకున్నారు..? అన్న కోణంలో వారు విచార‌ణ‌కు స‌హక‌రిస్తే.. వారి వృత్తిని బ‌ట్టి విచార‌ణ జ‌రిపించాల్సి ఉంటుంది. వారు ప‌బ్లిక్ కి ఫుడ్ స‌ప్లై చేస్తే ఖ‌చ్చితంగా అరెస్ట్ చేసి విచారించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. ఎన్నో రాష్ట్రాల్లో కోర్టు తీర్పులు ఇచ్చింది.. కానీ సైబ‌రాబాద్ పోలీసులు మాత్రం తూతూ మంత్రంగా.. డ్ర‌గ్స్ తీసుకుంటే వారంతా బాధితులే అన్న‌ట్లు వ్య‌వ‌హారించ‌డం వెన‌క కోట్లాది రూపాయ‌లు చేతులు మారిన‌ట్లు అరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

డ్ర‌గ్స్ మాఫియా కోసం చైన్ సిస్టం.?
హోట‌ల్ బిజినెస్ లో నెల‌కు ఎంత సంపాదించిన రూ. 50 ల‌క్ష‌ల‌కు మించ‌దు అని హోట‌ల్ బిజినెస్ చేసే వారు చెప్పుతున్నారు. కానీ వెల‌గ‌పూడి ర‌ఘుతేజ కుటుంబం గ‌తంలో ఉద్యోగాలు చేసేవారు.. హోట‌ల్ బిజినెస్ కి వ‌చ్చే స‌రికి జూబ్లిహిల్స్ లో హౌజ్, మూడు బెంచ్ కార్లు కొనుగోలు చేయ‌డంపై అనేక అనుమానాలు ఉన్నాయి. ర‌ఘు తేజ‌తో పాటు ఇత‌ని చైన్ సిస్టంలో ఉండే వ‌డ్డే ఖుషీ చంద‌ర్ ఆర్గానిక్ స్టోర్ పేరుతో స‌ప్లై చేసుంటాడ‌ని తెలుస్తోంది.. చెన్నుపాటి సాయి కృష్ణ రియ‌ల్ ఎస్టేట్ మ‌ధ్య‌వ‌ర్తిగా వ్య‌వ‌హారిస్తూ.. విఐపీల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటూ.. సప్లై చేసేవార‌ని నిఘా వ‌ర్గాలు స‌మాచారం రాబ‌ట్టాయి. వీరి ఫోన్ నెంబ‌ర్స్ కాల్ డేటా తీస్తే .. అనేక విష‌యాలు బయటపడే అవ‌కాశాలు ఉన్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు