Thursday, April 25, 2024

11 బి.సి. కులాలను గిరిజన జాబితాలో చేర్చితే ప్రతిఘటిస్తాం..

తప్పక చదవండి
  • హెచ్చరించిన ఎల్.హెచ్.పి.ఎస్. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జాటోత్ కిషన్ నాయక్..

హైదరాబాద్, 09 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
ఎల్.హెచ్.పి.ఎస్. ముఖ్య కార్యకర్తల సమావేశం హన్మకొండ పబ్లిక్ గార్డెన్ లో శుక్రవారం రోజు మధ్యాహ్నం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎల్.హెచ్.పి.ఎస్. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జాటోత్ కిషన్ నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులను విచ్చిన్నం చేయడానికి కుట్ర పన్నిందని, అందులో భాగంగానే 35 లక్షల జనాభా గలిగిన 11 బీసీ కులాలను గిరిజన జాబితాలో చేర్చి.. గిరిజనుల మనుగడను, అస్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తోందన్నారు.
అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసిన 11 బీసీ కులాలు ఆర్థికంగానూ, సామాజికంగానూ, రాజకీయంగాను, విద్యా, వ్యాపార రంగాలలో అభివృద్ధి చెంది ఉన్నారని.. వీరెవ్వరికి గిరిజన లక్షణాలు లేవని, వీరిని ఎస్టీ జాబితాలో చేర్చితే ఆదివాసి గిరిజనులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడిందని కనుక తక్షణమే అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని తెరాస ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.. లేని యెడల తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా వెనక్కి పంపాలని.. లేనియెడల బి.ఆర్.ఎస్., బి.జె.పి. లను రానున్న ఎన్నికల్లో గిరిజనులు తగిన బుద్ది చెబుతారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20న చలో హైదరాబాద్, ఇందిరా పార్క్ వద్ద గిరిజనుల మహా ధర్నాను నిర్వహిస్తున్నాము. ఈ మహాధర్నకు అన్ని రాజకీయ ప్రతిపక్ష నాయకులను, ప్రజా సంఘాల ప్రతినిధులను ఆహ్వానిస్తున్నాము.. కనుక గిరిజన విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయక్, బానోతు వసంత్ నాయక్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు అజ్మీర వెంకట్, వరంగల్ జిల్లా అధ్యక్షులు మాలోత్ వెంకన్న నాయక్, ములుగు జిల్లా ఇంఛార్జి ప్రవీణ్ నాయక్, భూపాల్లపల్లి జిల్లా ఇన్చార్జి అజ్మీర ఫుల్ సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు