Saturday, July 27, 2024

మృతిచెందిన ఇంజనీరింగ్ విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి..

తప్పక చదవండి
  • ఇందూర్ కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన..
  • జిల్లా అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్ కి వినతి పత్రాన్ని అందించిన పీ.డీ.ఎస్.యూ. నేతలు..

హైదరాబాద్, 14 సెప్టెంబర్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
సిద్దిపేట జిల్లా, అనంతసాగర్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని పీ.డీ.ఎస్.యు ఇంజనీరింగ్ వింగ్ డిమాండ్ చేసింది. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ పొన్నాల ఇందూర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎదుట విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ ని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పిడిఎస్యు సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి విద్యానాథ్ మాట్లాడుతూ జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు విద్యార్థులు కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, 50 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా ఇంజనీరింగ్ వింగ్ కన్వీనర్,కో కన్వీనర్స్ వెంకట్, వంశీ, సాయి కార్తీక్ మాట్లాడుతూ విద్యార్థులకు పరీక్ష సెంటర్లను స్థానికంగా కేటాయించాలని కోరుతూ గతంలో బోర్డ్ అధికారుల దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లిన కూడా పట్టించుకోకుండా అధికారులు పక్క జిల్లాల్లో పరీక్ష సెంటర్లు వేయడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సిద్దిపేట ఇందూర్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు అయిన నితిన్, గ్రీష్మ, నమ్రత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, గాయపడిన విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు పట్టణ అధ్యక్షుడు ప్రణయ్ కుమార్, ఇంజనీరింగ్ నాయకులు శ్రీధర్, దీపక్, పవన్, నందు, లక్ష్మన్, మనిదిప్, ప్రియాంక, ఐశ్వర్య, తిరుపతి, హిమవంత్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు