Saturday, June 15, 2024

తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణి

తప్పక చదవండి
  • ప్రత్యేక రాష్ట్రంతోనే నీటిగోస తీరింది
  • సాగునీటి కాలువలు కళకళలాడుతున్నాయి
  • కాంగ్రెస్‌ హయాంలో నీటిగోస తీర్చలే
  • ఛత్తీస్‌ఘడ్‌లో సమస్యలు తీర్చని కాంగ్రెస్‌
  • నాటికీ నేటికీ తేడాను ప్రజలు గమనించాలి
  • ములుగులో వాటర్‌ డే ఉత్సవాల్లో పాల్గొన్న కేటీఆర్‌

ఛత్తీస్‌గఢ్‌లో 24 గంటల ఉచిత కరెంటు ఉన్నదా? మరి ఎవరిని గెలిపిద్దాం? ఎవరిని ప్రోత్సహిద్దామో ఆలోచించాలి. రైతులు, సాగు, తాగునీరు మాత్రమే కాదు.. ఎందుకు దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నరు. వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనపై ఉన్నది.. కాంగ్రెస్‌ పార్టీకి ఛత్తీస్‌గఢ్‌లో ఇంటింటికీ నల్లా నీరిచ్చే మొఖం లేదు కానీ.. తెలంగాణలో మాత్రం పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారు..
` మంత్రి కేటీఆర్‌

ములుగు : తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణ అని రుజువు చేసిన మహానాయకుడు కేసీఆర్‌ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ ఏర్పాటులో నీటి గోస తీర్చిన ఘనత కెసిఆర్‌దని అన్నారు. ఆనాడు కాంగ్రెస్‌ హయాంలో ఎక్కడచూసినా నీటి సమస్యలే అని అన్నారు. ఎక్కడ చూసినా చెరువులు నిండుకుండల్లా నిండుగా కనిపిస్తున్నయ్‌. మాడుపలిగేలా ఉన్న ఎర్రటి ఎండల్లో చెరువులు మత్తళ్లు దుంకుతాయని కలలో కూడా అనుకున్నమా ఆలోచించాలన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ములుగులో నిర్వహించిన వాటర్‌ డే వేడుకల్లో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశాబ్ది సంబురాల్లో భాగంగా సాగునీటి దినోత్సవం జరుపుకుంటున్నాం. కేసీఆర్‌ పట్టుదలతో నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు న్యాయం జరగాలంటే స్వరాష్ట్రం ఏర్పడాలని 14 సంవత్సరాల పాటు పోరాటం చేశారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌లాంటి మేథావుల సహకారం, సారథ్యంలో తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతం చేసి ఎత్తిజెండా దించకుండా పోరాటం చేసి.. ఆ నాడు దాశరథి అన్న నా తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు.. కోటిన్నర ఎకరాల మాగాణ అని రుజువు చేసిన మహానాయకుడు కేసీఆర్‌’ అన్నారు. ముఖ్యమంత్రి సారథ్యంలో ఇవాళ సాగునీటి దినోత్సవ సంబురాలు జరుపుకుంటున్నాం. ఇక్కడికి హెలికాప్టర్‌లో వచ్చిన సమయంలో అంతా చూసుకుంటు వచ్చాం. ఎంతటి అద్భుతమైన దృశ్యం మన కండ్ల ముందటే కనిపిస్తున్నది. ఒకప్పుడు ఎండకాలం వచ్చిందంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు ఊళ్లకు వెళ్లాలంటే భయపడేవారు. ఊరికి వెళ్తే బిందెలు అడ్డం పెడతారో.. ఎక్కడ బోరింగ్‌ అడుగుతరో.. మోటరు అడుగుతరో.. అటు పైసలు లేక.. ప్రభుత్వం పట్టించుకోక అదోగతిపాలై ఆ నాడు కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో, సమైక్య రాష్ట్ర పాలనలో ఎంతో గోస ఉండేదే అందరూ గుర్తు చేసుకోవాలి. ఆ బాధ, ఆ గోస నేడు ఉన్నదా? ఒకసారి గుండెలమీద చేయి వేసుకొని చెప్పాలని అన్నారు. 67 సంవత్సరాలపాటు తెలంగాణ రాక ముందు మనం అధికారం ఇచ్చింది కాంగ్రెస్‌కు కాదా? దేశాన్ని, రాష్ట్రాన్ని ఏలింది కాంగ్రెస్‌ పార్టీ కాదా? మా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తాగునీరు ఇవ్వక సావగొట్టింది కాంగ్రెస్‌ కాదా? సాగునీరు ఇవ్వకుండా సతాయించింది కాంగ్రెస్‌ కాదా? ఇవాళ మళ్లీ వాళ్లే ముందటపడి అడ్డంపొడువు మాట్లాడితే నమ్ముదామా?అని ప్రశ్నించారు. లేదంటే మన గొంతు తడిపిన కేసీఆర్‌తో గళం కలిపి, భుజం తట్టి కేసీఆర్‌ మీరుకు ముందుకు నడవండి.. మీరు బాగుంటేనే పేదవారు బాగుంటారు.. రైతులు బాగుంటరు, వ్యవసాయం బాగుంటది అని చెప్పి వెన్నుతట్టి ప్రోత్సహిద్దామా? ఆలోచించాలన్నారు. సంక్రాంతి గంగిరెద్దులోళ్లు బయలుదేరి వచ్చినట్లు ఎలక్షన్లు రాంగనే బయలుదేరి వచ్చినట్లు కాంగ్రెస్‌, బీజేపోళ్లు వస్తున్నరు. నోటికి వచ్చినట్లు అడ్డంపొడువు మాట్లాడుతరు. మాటలు ఎన్నైనా చెప్పొచ్చు. పక్కకే ఉన్నది ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం. అక్కడ ఉన్నది కాంగ్రెస్‌ ప్రభుత్వం. నేను సూటిగా తెలంగాణ రైతులను అడుగుతున్నా.. ఆలోచించాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీకి ఛత్తీస్‌గఢ్‌లో ఇంటింటికీ నల్లా నీరిచ్చే మొఖం లేదు కానీ.. తెలంగాణలో మాత్రం పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారంటూ మంత్రి విమర్శించారు. తెలంగాణలో లాగే ఛత్తీస్‌గఢ్‌లో వరి, పత్తి సాగవుతుంది. అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎకరానికి ఎన్ని క్వింటాళ్లు కొంటుందో తెలుసా? రైతులు ఎన్ని క్వింటాళ్లు సాగు చేసినా ప్రభుత్వం కొనుగోలు చేసేది 12 క్వింటాళ్లే. మిగతా ధాన్యమంతా మార్కెట్‌కు వెళ్లి మిల్లర్‌ ఎంత ఇస్తే అంతకు అమ్ముకోవాల్సిందే తప్ప.. ప్రభుత్వ రక్షణ లేదు. ప్రభుత్వ మద్దతు ధర లేదు. ఇక్కడ కాంగ్రెస్‌ ప్రభుత్వం అలా ఉంటే.. ఇక్కడకు వచ్చి కాంగ్రెస్‌ నేతలు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతరు. ఇక్కడ ఇంకా కొనపాయె వడ్లు.. ఇంక ఎన్నడు కొంటరు? ఇంకేం చేస్తరి ఎగిరెగిరిపడుతరు. అక్కడ ఇచ్చేది ఎక…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు