Saturday, May 18, 2024

లక్నో కోర్టులో కాల్పులు

తప్పక చదవండి
  • లాయర్ల వేషంలో వచ్చి కోర్టు వద్ద కాల్పులు
  • కాల్పుల్లో సంజీవ్‌ జీవా అక్కడిక్కడే హతం

లక్నో

ఉత్తర్‌ ప్రదేశ్‌లో మరో గ్యాంగ్‌స్టర్‌ హతమయ్యాడు. అనూహ్యంగా కోర్టు వద్ద దుండగులు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు లక్నో సివిల్‌ కోర్టు వెలుపల గ్యాంగ్‌ స్టర్‌, ముఖ్తార్‌ అన్సారీ సన్నిహితుడు సంజీవ్‌ జీవాపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో అతను ప్రాణాలు కోల్పోయాడు. అతనిపై కాల్పులు జరిపిన దుండగుడు లాయర్‌ వేషంలో ఉన్నట్టు సమాచారం. బీజేపీ నేత బ్రహ్మదత్‌ ద్వివేది హత్య కేసులో నిందింతుడిగా ఉన్న జివాను విచారణ నిమిత్తం పోలీసులు లక్నో కోర్టుకు తీసుకువచ్చారు. ఈ సమయంలోనే ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఓ యువతి కూడా గాయపడిరది. ఓ పోలీస్‌ కాలుకు బుల్లెట్‌ గాయమైంది. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ గ్యాంగ్‌ స్టర్‌ పై గతంలో పలు క్రిమినల్‌ కేసులు కూడా నమోదయ్యాయి. రాష్ట్ర పోలీసుల కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ అతిక్‌ అహ్మద్‌ కాల్చి చంపబడిన రెండు నెలల తర్వాత ఈ ఘటన జరగడం పలు ఆందోళనలకు దారి తీస్తోంది. దుండగులు లాయర్ల వేషంలో వచ్చి జివాపై కాల్పులు జరిపారని, ఆ తర్వాత దుండగుడు అక్కడ్నుంచి పారిపోయినట్టు సమాచారం. పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. హత్యకు గల కారణాలు, ఎవరు, ఎందుకు చేశారన్న వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. జీవా కాంపౌండర్‌గా కెరీర్‌ ప్రారంభించాడు. ఆపై అండర్‌ వరల్డ్‌ లో సభ్యుడిగా మారాడు. 2018లో బాగ్‌ పత్‌ జైలులో కాల్చి చంపబడిన మున్నా బజరంగీకి జివా సన్నిహితుడు. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్‌ రాయ్‌ హత్యలో ముఖ్తార్‌ అన్సారీతో పాటు సంజీవ్‌ మహేశ్వరి జివా కూడా నిందితుడిగా ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు