Friday, April 19, 2024

కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఆమోదం

తప్పక చదవండి
  • సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం
  • కీలక అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం
  • ముందస్తు ఎన్నికలపై మరింత స్పష్టత నిచ్చిన సీఎం జగన్
  • షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు
  • మరో 9 నెలల్లో ఎన్నికలు : సీఎం జగన్

విజయవాడ : ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలుపడంతోపాటు, మంత్రులకు ఎన్నికలపైనా సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఏపీలో మరో 9 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని తెలిపారు. ఎన్నికలు షెడ్యూలు ప్రకారమే జరుగుతాయని వివరించారు. ఇప్పుడు శ్రమిస్తే గెలుపు మళ్లీ మనదే అవుతుందని మంత్రుల్లో విశ్వాసం కలిగించే ప్రయత్నం చేశారు. ఈ భేటీలో కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది అమ్మ ఒడి పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్యా కానుక పంపిణీకి, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కేబినెట్ ఆమోదం లభించింది. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో ఎంఓయూలు చేసుకున్న.. పలు సంస్థలకు భూ కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే.. పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టిన గృహనిర్మాణ ప్రాజెక్టులను వేగవంతం చేయడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఏపీ పునర్విభజన చట్టం కింద పెండింగ్‌లో ఉన్న సమస్యలు, రెవెన్యూ లోటుతో పాటు పోలవరానికి కేంద్ర ప్రభుత్వం నిధులను నిధులను విడుదల చేయడం, ప్రాజెక్ట్ నిర్మాణ పురోగతి వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించింది. మంత్రివర్గం సమావేశంలో చర్చించాల్సిన అంశాలు, ఆమోదం పొందాల్సిన ప్రతిపాదనలను అందజేయాలంటూ.. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అన్ని శాఖలను ఆదేశించారు. 5వ తేదీ మధ్యాహ్నానికే ఆయా ప్రతిపాదనలన్నీ సాధారణ పరిపాలన శాఖకు చేరాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు