అత్యంత ప్రశాంతమైన దేశం గా ఐస్‌ల్యాండ్ వరుసగా 15వ సారి టాప్ ర్యాంక్‌ను చేజిక్కించుకున్నది. ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ ఆ ర్యాంకులను ప్రకటించింది. మోస్ట్ పీస్‌ఫుల్ కంట్రీ జాబితాలో ఇండియా 126వ స్థానంలో నిలిచింది. మిలిటరీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్న అమెరికాలో శాంతి వాతావరణం కొరవడినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. గత ఏడాది కాలం నుంచి భారత్‌లో పీస్‌ఫుల్‌నెస్ 3.5 శాతం పెరిగినట్లు తెలిపారు.
ఐస్‌ల్యాండ్ తర్వాత డెన్మార్క్, ఐర్లాండ్, న్యూపజిలాండ్, ఆస్ట్రియా, సింగపూర్, పోర్చుగల్, స్లోవేనియా, జపాన్, స్విట్జర్లాండ్ దేశాల్లో టాప్ టెన్ ర్యాంకుల్లో ఉన్నాయి. ఐఈపీ తన సూచీలో మొత్తం 163 దేశాలకు ర్యాంకులు ఇచ్చింది. దాంట్లో అమెరికాకు 131వ ర్యాంక్ వచ్చింది. అమెరికాలో హత్యల రేటు పెరిగినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. దేశీయంగా, అంతర్జాతీయంగా ఉన్న సంక్షోభాలు, సమాజ భద్రత, సైన్యాన్ని పెంచుకుంటున్న తీరు ఆధారంగా పీస్‌ఫుల్‌నెస్ రిపోర్టును ఐఈపీ తయారు చేస్తుంది. ఓవరాల్‌గా ప్రపంచవ్యాప్తంగా గత ఏడాదితో పోలిస్తే శాంతియుత వాతారణం అన్ని దేశాల్లోనూ స్వల్పంగా తగ్గినట్లు రిపోర్టు పేర్కొన్నది.