- త్వరలో వరంగల్ లో భారీ బహిరంగ సభ..
గౌడులు రాజకీయంగా ఆర్థికంగా ఎదగడమే తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ లక్ష్యమని గౌడ సంఘాల నాయకులు అన్నారు. హన్మకొండ జిల్లా కేంద్రంలోని గోపాలపూర్ కళా ఫంక్షన్ హాల్ లో ఆదివారం రోజున బొనగాని యాదగిరి గౌడ్ అధ్యక్షతన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ గౌడ సంఘాల నాయకులతో కలిసి, తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ 5 వ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రముఖ సుప్రీం కోర్టు ప్రముఖ న్యాయవాది శేషగిరి రావు గౌడ్ ముఖ్య అతిధిగా హాజరైనారు. ఈ సందర్భంగా తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ నాయకులు పలు డిమాండ్లతో కూడిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. గౌడ కులస్తులు ఆర్థికంగా రాజకీయంగా అభివృద్దే లక్ష్యంగా తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని తీర్మానించారు. సభ్యత్వం ఉన్న గీత కార్మికులందరికీ ద్విచక్ర వాహనాలు, సేఫ్టీ మోకులు వెంటనే ప్రభుత్వం అంది ఇవ్వాలని, బీసీ కుల వృత్తిదారులకు ఇస్తున్న లక్ష రూపాయల పథకంలో గౌడ కులాన్ని చేర్చాలని.. తాడి చెట్టుపై నుండి పడి అంగవైకల్యం పొందిన, మరణించిన గీత కార్మికులకు వెంటనే రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, జీవో నెం.560 ప్రకారం ప్రతి గ్రామ సొసైటీలకు 5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించాలని.. కల్లు గీత కార్పొరేషన్ కు రూ.5 వేల కోట్ల లను కేటాయించి, చదువుకున్న గౌడ యువతి, యువకులకు పూర్తి సబ్సిడీతో కూడిన రుణాలను కేటాయించాలని.. గీత కార్మికులకు గుదిబండగా మారిన మెడికల్ బోర్డు నిబంధనలు వెంటనే రద్దు చేయాలని.. తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ నాయకులు సిరిసిల్ల లక్ష్మిపతి గౌడ్, జనగాం శ్రీనివాస్ గౌడ్, మార్క రవి గౌడ్, పులి మోహన్ గౌడ్, అనంతుల రమేష్ గౌడ్, నారగొని కుమార్ గౌడ్, చింత రమేష్ గౌడ్, నకరకాంటి మోహన్ గౌడ్, పులి శ్రీనివాస్ గౌడ్, రావుల వెంకట రమేష్ గౌడ్, కత్తి సంపత్ గౌడ్, మాటూరి రవీందర్ గౌడ్, ఏరుకొండ శ్రీనివాస్ గౌడ్, పంజలా భూపాల్ గౌడ్, గండు రాము గౌడ్, కక్కెర్ల రాజు గౌడ్, మార్క రజినీకార్ గౌడ్, కొత్తకొండ సుభాష్ గౌడ్, భీమాగాని సౌజన్య గౌడ్, నాగపూరి స్వప్న గౌడ్, కోలా కిట్టు గౌడ్, దూలం రాజేందర్ గౌడ్, మార్క అనిల్ గౌడ్, ఎం. మొండయ్యా గౌడ్, గట్టు యుగేందర్ గౌడ్, కూనూరు రంజిత్ గౌడ్, బొల్లికొండ యాదగిరి గౌడ్, గిరికత్తుల సాయి బాబా గౌడ్, బుర్ర వెంకట్ నరసింహ గౌడ్, కోతి సాంబ రాజు గౌడ్, బైరి ఇంద్రసేన గౌడ్, బొల్లికొండ రాం మూర్తి గౌడ్,శ్రీనివాస్ గౌడ్, సొల్తీ కిరణ్ గౌడ్, ప్రజా ప్రతినిధులు, గౌడ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు..