Thursday, October 10, 2024
spot_img

అంగళ్లు గ్రామంలో వైసిపి దాడులతో ఉద్రిక్తత

తప్పక చదవండి
  • పుంగనూరు పుడింగి సంగతి తేలుస్తా
  • బాంబులకే బయపడలేదు..రాళ్లకు భయపడతానా?
  • టిడిపి కార్యకర్తతలపై దాడులు జరుగుతున్నా పోలీసుల ప్రేక్షకపాత్ర
  • మంత్రి పెద్దిరెడ్డి తీరుపై మండిపడ్డ చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని, పుంగనూరుకు వెళ్తున్నా.. అక్కడ పుడిరగి సంగతి తేలుస్తానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. పోలీసుల అండతో వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా కురబలకోటలో బాబు మాట్లాడుతూ.. వైసీపీ శ్రేణుల రాళ్ల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలకు చికిత్స చేయించాలని టీడీపీ నేతలకు సూచించారు. ఇక్కడ ఒక రావణాసురుడు ఉన్నాడని, ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నానన్నారు. ’పులివెందులకే వెళ్లాను.. ఇక్కడికి రాకూడదా?’ అంటూ ప్రశ్నించారు.

తానూ చిత్తూరు జిల్లాలోనే పుట్టానన్నారు. టీడీపీ కార్యాకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారని మండిపడ్డారు. తాను బాంబులకే భయపడలేదని.. రాళ్లకు భయపడతానా? అని అన్నారు. వైసీపీ శ్రేణులు రాళ్లదాడి చేయడంతో ఎన్‌ఎస్‌జీ బలగాలు చంద్రబాబుకు రక్షణగా నిలబడ్డాయి. వైసీపీ దాడులకు తెగ బడిరదంటూ టీడీపీ కార్యకర్తలు చంద్రబాబుకు గాయాలు చూపించారు. మంత్రి పెద్దిరెడ్డి పతనం అంగళ్లు నుంచే ప్రారంభమైందని, పెద్దిరెడ్డి ఈరోజు నుంచి రోజులు లెక్కపెట్టుకో అంటూ చంద్రబాబు వార్నింగ్‌ ఇచ్చారు. చంద్రబాబు మాట్లాడు తుండగానే టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు రాళ్లు రువ్వారు. కాగా అన్నమయ్య జిల్లాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కురబలకోటలో టీడీపీ నేతలపై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. పోలీసులు పక్కనే ఉన్నా రాళ్ల దాడిని నిలువరించలేకపోయారు. అటు బస్టాండ్‌ వద్ద టీడీపీ నేతపై వైసీపీ గూండాలు దాడులకు తెగబడ్డాయి. చంద్రబాబు పర్యటనకు వెళుతున్న టీడీపీ కార్యకర్త వద్ద నుంచి జెండాలు లాక్కున్నారు. విచక్షణారహితంగా దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వైసీపీ గూండాల నుంచి టీడీపీ కార్యకర్తను కాపాడారు.

- Advertisement -

వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని చంద్రబాబు అన్నారు. కురబలకోట మండలం, అంగళ్లులో యుద్ధవాతావరణం నెలకొంది. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేం దుకు వైసీపీ శ్రేణులు రోడ్డుపైకి వచ్చి నిరసన, రాస్తారోకో చేపట్టారు. చంద్రబాబు అంగళ్లుకు వచ్చే సమయానికి వైసీపీ కార్యకర్తలు మరింత రెచ్చిపోయి టీడీపీ కార్యకర్తలపై రాళ్ల దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వైసీపీ కార్యకర్తలు టీడీపీ బ్యానర్లను తొలగించారు. అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలపై దాడులు చేశారు. అన్నమయ్య జిల్లా పుంగనూరులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రాజెక్టుల యాత్రకు వస్తున్న సందర్భంగా అడ్డుకునేందుకు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాల్లోఉద్రిక్తత ఏర్పడిరది. అంగళ్లు గ్రామంలో పరిస్థితి అదుపు తప్పింది. రణరంగంలా మారిన అంగళ్లు గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్‌ చేశారు. చంద్రబాబుకు స్వాగతం పలకడానికి వెళ్తున్న టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు. పోలీసుల సమక్షంలోనే వైసీపీ కార్యకర్తల దాడులు చేశారు. టీడీపీ కార్యకర్తలు తిరగబడటంతో.. ఉద్రిక్తత ఏర్పడిరది. పోలీసులు టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్‌ చేశారు.

పుంగనూరులో రెండు నీటి ప్రాజక్టులపై కోర్టు స్టే తెచ్చి నిలిపివేశారని.. అభివృద్ధి చేస్తే ఏమాత్రం సహించలేక ఇలాంటి పనులు చేశారని అందుకే చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని వైసీపీ కార్యకర్తలు ప్రకటించారు. చంద్రబాబు గో బ్యాక్‌ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ రోడ్లపై పెద్ద ఎత్తున గుమికూడారారు. పుంగనూరులో ప్రాజెక్టులు నిలిచిపోవడామికి కారణమైన చంద్రబాబును ఎట్టి పరిస్థితులలో ఇక్కడ అడుగుపెట్టినివ్వమని హెచ్చరించారు. పెద్దిరెడ్డి అరాచకాలకు, అవినీతి ప్రతీక ఆ ప్రాజెక్టులు అందుకే అడ్డుకుని రైతులకు న్యాయం చేశామని.. రైతులకు పరిహారం ఇవ్వకుండా.. పెద్దిరెడ్డి దోచుకున్నారని మండిపడుతున్నారు. ప్రతిపక్ష నాయకుడి పర్యటనను అడ్డుకుంటామని వైసీపీనేతలు రోడ్డుపైకి పోలీసులు వారికే వత్తాసు పలుకుతున్నరాని.. టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ నాయకుల దౌర్జన్యంకు భయపడే పరిస్థితి లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. బంబులతోనే పోరాడిన వ్యక్తి నేను.. రాళ్ళు వేస్తే భయపడతానా..అని ప్రశ్నించారు. ధైర్యం ఉంటే తన ముందుకు రావాలని సవాల్‌ చేశారు. తాను కూడా నేను చిత్తూరు జిల్లాలోనే పుట్టా.. చిత్తూరు జిల్లాలోనే రాజకీయం చేశానన్నారు. జగన్‌ లాంటి రాజకీయాలు నేను ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. పుంగనూరులో ఎ ప్రతిపక్ష పార్టీ నేత పర్యటించేందుకు ప్రయత్నించినా ఇదే పరిస్థితి ఉంటుంది. చివరికి ఇటీవలే కొత్త పార్టీ పెట్టుకున్న రామచంద్ర యాదవ్‌ అనే నేత తన అనుచరులతో ర్యాలీ నిర్వహించినా పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ఇంటిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున దాడి చేశారు. నష్టం చేశారు. ఇలాంటి దాడులు ప్రతిపక్ష నేతలపై పుంగనూరులో తరచూ జరుగుతూ ఉంటాయి. ఈ సారి చంద్రబాబు పర్యటననే అడ్డుకునేందుకు ఉద్రిక్తతలు సృష్టించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు