Saturday, March 2, 2024

ఆచారి కాదతను.. ఆచార్యుడు

తప్పక చదవండి
  • ప్రజా సమస్యలపై అలు పెరుగని పోరాటం చేస్తున్న వీరుడు
  • వేదిక ఏదైనా ఆయన మాట తుపాకీ తూటా కంటే పదునైంది
  • నియోజకవర్గంలో పట్టుబట్టి ప్రజా సమస్యలు తీర్చడంలో విక్రమార్కుడు
  • గెలుపు ఓటములను చిరునవ్వుతో స్వీకరించే గొప్ప నాయకుడు
  • భక్తిలో భావంలో హనుమంతుడు ఆయనే తల్లోజు ఆచారి

హైదరాబాద్‌ : కల్వకుర్తి నియోజకవర్గంలో యువతకు ఆరాధ్య దైవం యువతని సన్మార్గంలో నడిపే నాయకుడు తల్లోజు ఆచారి కాదు ఆయన ఆచార్యుడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఆచారన్న యువసేన పేరుతో యువకులు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువత అన్ని రంగాల్లో ముందుండాలని వారికి మార్గదర్శిగా నిలిచే వ్యక్తి ఆయన బీజేపీ పార్టీ తరపున గత 30 ఏళ్ల నుండి నియోజకవర్గంలో ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు అందించిన ఘనత ఆయనకే దక్కుతుంది ఆచారన్న అంటే పసిపిల్లలు కూడా మురిసిపోయే మనిషి ఆయనలోని మొక్కవోని ధైర్యం హుందాతనం క్రమశిక్షణ ప్రజల పట్ల ఆయనకు ఉన్న గౌరవ మర్యాద లాంటి మంచి ఆలోచనలతో ముందుకెళ్తున్న ఆయన పట్ల యువత ఆకర్షితులు అవుతున్నారు.

సమస్యలపై అలుపెరుగని పోరాటం
కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజలు ఎలాంటి సమస్య ఉన్న వారి పక్షాన నిలిచి న్యాయం జరిగే వరకు పోరాటాలు చేసిన వీరుడు. ఎంతోమందికి అధికారుల దగ్గర జరగకపోతే దగ్గరుండి పనులు చేయించేవాడు. పునర్విభజనలో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గం రెండు ముక్కలుగా విడిపోయింది. నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో కల్వకుర్తి మండలం వెల్దండ మండలం ఉండగా రంగారెడ్డి జిల్లాలో మాడుగుల, ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్‌, ఉన్నందున ఈ ప్రాంత ప్రజలు పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులు నెలకొన్నాయి. రెవెన్యూ పనుల నిమిత్తం ఆర్డిఓ కార్యాలయానికి కందుకూర్‌ కు వెళ్లాలి, రిజిస్ట్రేషన్లు చేయాలంటే మహేశ్వరం, విద్యుత్‌ పనులు నిమిత్తం గచ్చిబౌలి వెళ్లాలి, కోర్టు పనుల నిమిత్తం ఎల్బీనగర్‌ వెళ్లాలి. అయితే ఈ ఇబ్బందులు లేకుండా అన్ని కార్యాలయాలు ఆమనగల్లులో ఏర్పాటు అయ్యే విధంగా కృషి చేస్తానని ఆయన అన్నారు.

- Advertisement -

వేదిక ఏదైనా ఆయన మాట తుపాకి తూటా
ప్రజా సమస్యలపై ప్రజా వేదిక ఏది ఉన్న నిర్మొహమటంగా ముక్కు సూటిగా మాట్లాడే తత్వం ఆయనది.. ప్రతిపక్ష నాయకులతో పాలక పక్షాల దృష్టికి సమస్యను తీసుకెళ్లి సమస్య గురించి నిలదీసి అడగడం ఆయన నైజం. ప్రజలు ఎవరైనా మన పార్టీనా ఇంకో పార్టీనా అని చూడకుండా వారి ఆపద సాపదను దృష్టిలో పెట్టుకొని వారికి న్యాయం జరిగే విధంగా పోరాటం చేయడం.. ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆమనగల్‌ మండలంతో పాటు నియోజకవర్గంలో ఎక్కడైనా ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగల సత్తా ఉన్న నాయకుడు. అందుకే ఆయన పట్ల ప్రజలకు అపారమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఆపద అంటే ఆమడ దూరం పారిపోయే వ్యక్తులున్న నేటి సమాజంలో ఆపదంటే నేనున్నానంటూ భరోసా కల్పించే గొప్ప నాయకుడు తల్లోజు ఆచారి.

ప్రజా సమస్యలు తీర్చడంలో విక్రమార్కుడు
ప్రజల సమస్యలు తీర్చడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. సమస్యల మీద పోరుబాట సాగించిన అలుపెరుగని పోరాటయోధుడు. తాగునీరుకు గాని సాగునీరుకు గాని నియోజకవర్గంలో ఎన్నో పోరాటాలు చేసిన ఘనత ఆయనది. ఎవరికైనా ఆసరా అందించాలంటే నేనున్నానంటూ ముందు వరుసలో కనపడే వ్యక్తి అధికారుల దగ్గర కానీ ప్రజా ప్రతినిధుల దగ్గర గాని అలాగే నియోజకవర్గంలోని విద్యార్థులకు ఎలాంటి సమస్యలు వచ్చినా తీర్చడంలో ఆయన ముందుంటాడు ఏబీవీపీలో పనిచేసిన అప్పటినుండి ఆయన మార్గం పోరాట మార్గమే పట్టుబట్టి ప్రజలసమస్యలు తీర్చడంలో విక్రమార్కుడు.

గెలుపోటములను చిరునవ్వుతో స్వీకరించే నాయకుడు
ఆయన చిన్నతనం నుండి కూడా ఎన్నో రకాలుగా గెలుపోటములను చూస్తూ ముందుకు సాగే వ్యక్తి మనుషులకు వ్యవస్థతో ఉన్న అనుబంధం మేరకు గెలుపోటములు సమానంగా స్వీకరించాలని అంటాడు. ఆయన గత నాలుగు పర్యాయాల నుండి ఎన్నోసార్లు ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యేకు వివిధ పదవులకు పోటీచేసి ఓడిపోయిన కూడా ఓటమిని చిరునవ్వుతో స్వీకరించే గొప్ప మనస్తత్వం ఉన్న నాయకుడు. భక్తిలోను హనుమంతుని లాంటి వాడని, ప్రతి సంవత్సరం అయ్యప్ప దీక్ష తీసుకోవడం ఎంతోమందికి దేవునిపై నమ్మకాన్ని పెంచడంలో ఆయన పాత్ర చాలా కీలకమని భగవంతుని నమ్మినవాడు. బాగుపడతాడని ప్రజల్లో భగవంతుని పట్ల విశ్వాసాన్ని ఆయన కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తారు.

నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలబెడతాను
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాల పట్ల ఆయన ఒక ఇంత అసనం వ్యక్తం చేశారు. వారు తీసుకున్న పనికిమాలిన నిర్ణయాల వల్ల కల్వకుర్తి నియోజకవర్గం ఎంతో వెనకబడిరదని వ్యాపార పరంగా దెబ్బతిన్నదని నియోజకవర్గాన్ని రెండు ముక్కలు చేసి ప్రజలను గోస పెడుతున్నారని అందుకే ఎన్నికల బరిలో దిగిన నన్ను ఆశీర్వదించి గెలిపించాలని బీజేపీ పార్టీకి ప్రజలకు విధేయుడిగా ఉంటానని ఆయన అన్నారు. ఇప్పటికి కూడా గ్రామాల్లో పల్లె ప్రగతి, ఉచిత రేషన్‌, ఆసరా పింఛన్‌, గ్రామ జ్యోతి కింద ఇస్తున్న నిధులు గ్రామపంచాయతీలకు నేరుగా అందిస్తున్న నిధులు కేంద్ర ప్రభుత్వానివే అంతేకాకుండా కరోనా సమయంలో వ్యాక్సిన్‌ అందించి కోట్లాదిమందికి కరోనా నుంచి విముక్తి కల్పించింది కూడా కేంద్ర ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకంలోనూ కేంద్ర ప్రభుత్వం మెజార్టీ వాటా 75 శాతం అందిస్తుందని 25 శాతం అందించే రాష్ట్ర ప్రభుత్వం తామే ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా నియోజకవర్గంలోని ఆరు మండలాల ప్రజలు ఆలోచించాలని బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న నన్ను ఆశీర్వదించాలని తాను గెలిస్తే కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ద్వారా తెలంగాణ ఇంకా అభివృద్ధి చెందుతుందని దోపిడి రాజ్యం పోతుందని ఆయన పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు