Saturday, July 27, 2024

తెలుగు రాష్ట్రాలో అత్యంత ఉభయ ఆదరణ పొందిన జైన రమేష్ కు వైశ్యా లైమ్ లైట్ అవార్డు ప్రధానోత్సవం

తప్పక చదవండి

హైదరాబాద్: తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రెండు ఉమ్మడి రాష్ట్రాలలో నిర్వహించినటువంటి వైశ్యా లైమ్ లైట్ అవార్డ్స్ యొక్క ప్రధానోత్సవం నిన్న హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ జేఆర్సి కన్వెన్షన్ నందు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి రెండు రాష్ట్రాల్లోని పలు ప్రముఖ వాణిజ్య సంస్థలు ప్రదానం చేశాయి అందులో ముఖ్యంగా వాసవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ,మానేపల్లి జ్యువెలర్స్ ,ఇమ్మడి టీవీ వారి సౌజన్యంతో నిర్వహించారు.. ఈ అవార్డ్స్ నందు రెండు రాష్ట్రాల్లో మోస్ట్ పాపులర్ వైశ్య మెన్ అనగా వైశ్యుల్లో ఎక్కువ ప్రజాదరణ పొందిన పురుషుడు విభాగం ఆన్లైన్ ఓటింగ్ ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో రెండు రాష్ట్రాల నుండి 78 మంది నామినేషన్ అయ్యారు మొదటి 5 గురుకి అవార్డ్స్ ప్రధానం చేయడం జరిగింది. అందులో భాగంగా మన జనగామ ప్రాంతం నుండి ఆర్యవైశ్య ముద్దుబిడ్డ అయిన జైన రమేష్ గారు 4వ నాలుగో స్థానాన్ని పొందడం జరిగింది. వీరికి 7 7 77 ఓట్లు పొందడం జరిగింది

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నిజామాబాద్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, పర్యాటకశాఖ పూర్వ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా చేతుల మీదుగా ఈ అవార్డుని పొంది సన్మానం చేయడం జరిగింది. దీనికి జనగామ నుండి ప్రముఖమైన వ్యక్తులు పాల్గొని వారందరి ఆధ్వర్యంలో ఈ అవార్డుని గైకొనడం సంతోషంగా కలిగించింది. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా ప్రముఖ హీరో సుమన్, దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి, ప్రముఖ వైశ్య పెద్దలు కోలేటి దామోదర్ గుప్తా, స్టార్ ఆఫ్ ది ఈవెంట్ శివత్మిక రాజశేఖర్, తదితర ముఖ్య మైన వారు చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించ నైనది..

- Advertisement -

ఈ అవార్డ్ గ్రహీత మాట్లాడుతూ ఎవడు పొందినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నా పై అత్యంత ప్రజాదరణ ఉండడం వల్ల అంతే బాధ్యత కూడా నా పై ఉంది .. ఇంకా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో సమాజ సేవలో పాల్గొని నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని బాధ్యతతో తెలియజేస్తున్నాను.. ఈ కార్యక్రమానికి జనగామ నుండి ప్రముఖులైన పజ్జూరి గోపయ్య, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు మహంకాళి హరి చంద్రగుప్త, ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షులు బిజ్జాల నవీన్ కుమార్, మార్యాల అశోక్, గాందే వేణు, శర్విరాల ఉపేందర్, తోడుపునూరు ప్రసాద్, బచ్చు అశోక్, మంచన హరీష్, మహంకాళి నటరాజ్, అల్లాడి రామకృష్ణ, జి. కృష్ణ కందుకూరి కుమార్ తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు