Friday, September 13, 2024
spot_img

అమెరికా బయలుదేరిన వకుళాభరణం..

తప్పక చదవండి

ఆయనకు ఎయిర్ పోర్ట్ లో వీడ్కోలు పలికిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి..

హైదరాబాద్, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సభలకు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు హాజరు కానున్నారు. ఆయనకు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో వీడ్కోలు పలికారు. ఈ మహాసభల సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు తానా అవార్డులను బహుకరించనున్నది. తానా మహాసభలలో ప్రత్యేక అతిథిగా పాల్గొనడానికి సోమవారం నాడు బయలుదేరిన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి, ఆయన అభిమానులు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో వీడ్కోలు పలికారు. దుండ్ర కుమారస్వామి ఆయనకు పూలమాలలు వేసి.. శాలువాలతో సన్మానం చేశారు. డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు గారు ఈనెల 24వ తేదీ వరకు అమెరికాలోని పలు ప్రాంతాలలో జరిగే ఆత్మీయ అభినందన కార్యక్రమాలలో పాల్గొంటారు. తెలంగాణ అభివృద్ధి, బీసీల సంక్షేమంపై ఆయన పలు కార్యక్రమాలలో కీలక ఉపన్యాసం చేశారు. డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు పర్యటన విజయవంతం కావాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ఆకాంక్షించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు