- మధ్యాహ్నం నింగికెగసిన చంద్రయాన్`3
- ప్రొపల్షన్ మాడ్యూల్‌ను మోసుకెళ్లిన ఎల్వీమ్3`ఎం4
- 40 రోజుల పాటు ప్రయాణించనున్న మాడ్యూల్
- భారతీయుల కలలను మోసుకెళ్లిన చంద్రయాన్
- మన శాస్త్రవేత్తల పట్టుదలకి, నిబద్ధతకి నిదర్శనం
- శాస్త్రవేత్తలకు ప్రధాని మోడీ, రాష్ట్రపతి శుభాకాంక్షలు
- మరో రికార్డు సృష్టించిన ఇస్రో శాస్త్రవేత్తలు
- శాస్త్రవేత్తలకు తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందనలు
ఇస్రో మరో రికార్డు సృష్టించింది. చంద్రుడి దిశగా చంద్రయాన్3 పయనమైంది. శ్రీహరికోటలోని సతీశఇస్రో మరో రికార్డు సృష్టించింది. చంద్రుడి దిశగా చంద్రయాన్
3 పయనమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ సెంటర్ నుంచి ఎల్‌వీఎం3 ఎం4 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. చంద్రయాన్ స్పేస్‌క్రాప్ట్‌ను ఆ రాకెట్ మోసుకువెళ్లింది. శుక్రవారం మధ్యాహ్నం 2.35 నిమిషాలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. చంద్రయాన్3ని గగనానికి మోసుకెళ్లిన ఎల్వీమ్3
ఎం4 రాకెట్ అన్ని దశలు సాఫీగా పూర్తి చేసింది.
శ్రీహరికోట : ఇస్రో మరో రికార్డు సృష్టించింది. చంద్రుడి దిశగా చంద్రయాన్3 పయనమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ సెంటర్ నుంచి ఎల్‌వీఎం3 ఎం4 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. చంద్రయాన్ స్పేస్‌క్రాప్ట్‌ను ఆ రాకెట్ మోసుకువెళ్లింది. శుక్రవారం మధ్యాహ్నం 2.35 నిమిషాలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. చంద్రయాన్
3ని గగనానికి మోసుకెళ్లిన ఎల్వీమ్3ఎం4 రాకెట్ అన్ని దశలు సాఫీగా పూర్తి చేసింది. అనుకున్న సమయానికే చంద్రయాన్
3ని నిర్దేశిత కక్ష్యలోకి విడుదల చేసింది. ఎల్వీమ్3ఎం4 రాకెట్ నుంచి చంద్రయాన్
3 ప్రొపల్షన్ మాడ్యూల్ విజయవంతంగా విడిపోయింది. ఆగస్టు 23వ తేదీన చంద్రుడిపై ఆ ల్యాండర్ దిగే అవకాశాలు ఉన్నాయి. చంద్రుడి ఉపరితలాన్ని అధ్యయనం చేసేందుకు పేలోడ్‌లో ప్రత్యేక పరికరాన్ని పంపుతున్నారు. చంద్రయాన్3 ప్రయోగం విజయవంతం కావడంతో శ్రీహరికోటలో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రయాన్
3 భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టడంతో ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది. చంద్రయాన్3లో ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్ ఉన్నాయి. దీని బరువు దాదాపు 3,900 కిలోగ్రాములు. స్పేస్‌క్రాప్ట్ కోసం భూమి నుండి చంద్రునికి ప్రయాణం దాదాపు ఒక నెల పడుతుందని అంచనా వేస్తున్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఆవిష్కరించడమే బాహుబలి రాకేట్ లక్ష్యంగా దూసుకుపోతుంది. చంద్రయాన్
3 సుమారు 3,84,000 కి.మీ ప్రయాణించనుంది. ఆగస్ట్ 23 లేదా 24న చంద్రునిపై సాప్ట్ ల్యాండిరగ్ కానుంది. చంద్రయాన్ చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు చేయనుంది. ఇస్రో సత్తాకు ఇది నిదర్శనంగా నిలుస్తుందని ఇస్రో ఛైర్మన్ పేర్కొన్నారు. చంద్రయాన్3 మిషన్ కోసం పనిచేస్తున్న శాస్త్రవేత్తలకు ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ అభినందనలు తెలిపారు. చంద్రయాన్ ప్రయోగంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ తదితరులు అభినందనలు తెలిపారు. భారత శాస్త్రవేత్తలను అభినందించారు. 2019లో ప్రయోగించిన చంద్రయాన్2 కొన్ని సాంకేతిక కారణాలతో చంద్రుడిని రెండు మీటర్ల దూరం నుంచి అత్యంత వేగంగా చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టింది. ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా కచ్చితమైన జాగ్రత్తలను ఇస్రో తీసుకుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండిరగ్ అయ్యేలా కీలక సెన్సార్లు, కెమెరాలను అమర్చించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే అమెరికా, చైనా, రష్యా తర్వాత చంద్రుడి మీద సాఫ్ట్ ల్యాండిరగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది. ఆగస్టు 23 లేదా 24న చంద్రుడి ఉపరితలం మీదకు విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండిరగ్ అయ్యేలా అంతా సిద్ధం చేశారు. ల్యాండర్ సురక్షితంగా చంద్రుడి మీదకు దిగాక.. ల్యాండర్‌లోని ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వస్తుంది. సుమారు 14 రోజులపాటు అక్కడ పరిశోధనలు చేస్తుంది. చంద్రయాన్
3 మిషన్ కోసం ఇస్రో సుమారు 630 కోట్ల రూపాయలు ఖర్చుచేసింది. చంద్రుడిపై ప్రయోగాలను 2008లో భారత్ ప్రారంభించింది. అప్పట్లో చంద్రయాన్1ను ప్రయోగించింది. అందులో భాగంగా ప్రయోగించిన మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ చంద్రుడిని నీరు ఉనికి ఉందని తొలిసారిగా కనుగొంది. అనంతరం చంద్రుడి మీదకు ల్యాండర్ దించి చంద్రుని దక్షిణ ద్రువం పైన పరిశోధనలు చేయాలనేది చంద్రయాన్ మిషన్ ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం 2019 జులై 22న చంద్రయాన్
2ను ఇస్రో ప్రయోగించింది. ఇందులో భాగంగా ల్యాండర్, రోవర్‌ను చంద్రుడిపై సురక్షితంగా ల్యాండిరగ్ చేయాలన్నది ఇస్రో ఆలోచన. అయితే అనుకున్న విధంగానే ఆర్పిటర్ విడిపోయింది. చంద్రుడిని కేవలం 2 కిలోమీటర్ల ఎత్తులో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లో సమస్య తలెత్తింది. ఫలితంగా అత్యంత వేగంగా ఈ రెండు చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టాయి. అయితే చంద్రుని ఉపరితలంపైకి ఇప్పటికే అమెరికా, చైనా, రష్యా తమ ల్యాండర్లను పంపాయి. కానీ ఇప్పటి వరకు ఎవరూ వెళ్లని చంద్రుని దక్షిణ ధ్రువంలో ల్యాండర్‌ను దించి, అక్కడ కీలక పరిశోధనలు చేయాలనే లక్ష్యంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పనిచేసింది. చంద్రుని యొక్క దక్షిణ ప్రాంతంలో వందల కోట్ల సంవత్సరాలుగా సూర్యకాంతి పడని ఎన్నో ప్రాంతాలున్నాయని ఇస్రో భావిస్తోంది. అలాంటి చోట ప్రయోగాలు నిర్వహించి విశ్వం పుట్టుగ యొక్క రహస్యాలు, భవిష్యత్‌లో చంద్రుడిపై మానవులు నివసించేందుకు గల అవకాశాలపై ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకుంది.
ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోడీ అభినందన
చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇస్రోకి అభినందనలు తెలిపారు. భారత దేశ అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైందని ప్రశంసించారు. చంద్రయాన్ 3 ప్రతి భారతీయుడి కలల్ని, ఆకాంక్షల్ని మోసుకెళ్లిందని అన్నారు. ఇది మన శాస్త్రవేత్తల పట్టుదలకి, నిబద్ధతకి నిదర్శనం అని కొనియాడారు. ’భారత దేశ అంతరిక్ష చరిత్రలో చంద్రయాన్ 3 కొత్త అధ్యాయాన్ని లిఖించింది. దేశంలోని ప్రతి పౌరుడి ఆకాంక్షల్ని, కలల్ని ఇది నింగిలోకి మోసుకెళ్లింది. మన శాస్త్రవేత్తల నిబద్ధతకు ఈ ప్రయోగమే నిదర్శనం. వాళ్ల ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకి సెల్యూట్’ అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ ప్రయోగంపై స్పందించారు. చంద్రయాన్ 3 ని ప్రయోగాన్ని విజయవంతం చేసినందుకు ఇస్రో శాస్త్రవేత్తల కు అభినందనలు తెలిపారు.
ఇస్రో మరో రికార్డు సృష్టించింది
శాస్త్రవేత్తలకు సిఎం కెసిఆర్ అభినందనలు
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిర్వహించిన చంద్రయాన్3 ప్రయోగం విజయవంతమైంది. చంద్రయాన్
3ని ఇస్రో విజయవంతంగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్, శాస్త్రవేత్తలు, ఇతర సాంకేతిక సిబ్బందిని అభినందిస్తూ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్ 3 విజయవంతం కావడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన రంగం.. కీలక మైలురాయిని దాటిందని సీఎం అన్నారు. ్ ధావన్ సెంటర్ నుంచి ఎల్‌వీఎం3 ఎం4 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. చంద్రయాన్ స్పేస్‌క్రాప్ట్‌ను ఆ రాకెట్ మోసుకువెళ్లింది. శుక్రవారం మధ్యాహ్నం 2.35 నిమిషాలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. చంద్రయాన్3ని గగనానికి మోసుకెళ్లిన ఎల్వీమ్3
ఎం4 రాకెట్ అన్ని దశలు సాఫీగా పూర్తి చేసింది.
తప్పక చదవండి
-Advertisement-