Wednesday, May 22, 2024

యూపీలోనూ భారీ వర్షాలు

తప్పక చదవండి
 • పొంగి ప్రవహిస్తున్న శారదానది
 • నదిలో కొట్టుకు పోయిన పాఠశాల
 • దేశ వ్యాప్తంగా 145 మందికి పైగా మృతి
 • హిమాచల్‌లో 91 మంది, ఉత్తరప్రదేశ్‌లో 14,
 • హర్యానాలో 16, పంజాబ్‌లో 11, ఉత్తరాఖండ్‌లో 16మృతి
  న్యూఢిల్లీ : రుతుపవనాల ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వర్షాల కారణంగా పలు నదులు పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌ లో భారీ వర్షాలకు నదులు పొంగి పొర్లుతున్నాయి. లఖింపుర్‌ ఖేరీ జిల్లాలోని శారదా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నది ఒడ్డున ఉన్న
  పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. కర్దాహియా మన్‌ పూర్‌ గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాల నదిలో కొట్టుకుపోయింది. ఆ సమయంలో పాఠశాలలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, వరద ఉధృతి కారణంగా వారం రోజుల్లోనే దాదాపు డజనుకు పైగా ఇళ్లు, గుడిసెలు కొట్టుకుపోయినట్లు గ్రామస్థులు తెలిపారు. వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయని వాపోయారు. దేశ రాజధాని ఢిల్లీ ని వరదలు ముంచెత్తాయి. యమునమ్మ శాంతించకపోవడంతో హస్తిన ఓ నదిలా మారింది. ఎటుచూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి అధికారిక నివాసం, మంత్రుల ఇళ్లు, సచివాలయం సహా చారిత్రక కట్టడం ఎర్రకోట, రాజఘాట్‌ ను సైతం వరద ముంచెత్తింది. ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతు మేర నీరు చేరింది. పలు కాలనీలు పూర్తిగా నీట మునిగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఈ వరద సుప్రీంకోర్టు కాంప్లెక్స్‌ లోకి కూడా ప్రవేశించింది.మరోవైపు యమునా నదిలో వరద ఉధృతి కొంత మేర తగ్గినట్లు అధికారులు తెలిపారు. గురువారం రాత్రి 208.66 మీటర్లు ఉన్న నీటి మట్టం.. శుక్రవారం ఉదయం 6 గంటలకు 208.46కు తగ్గింది. మధ్యాహ్నం 1 గంటకు 208.30 మీటర్లు తగ్గొచ్చని కేంద్ర జల సంఘం అంచనా వేసింది. మరోవైపు వరదల కారణంగా ఢల్లీిలోని పలు ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్‌ కోతలు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
  హిమాచల్‌ వరదల్లో ఈత్యధికంగా 91 మంది మృతి. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతంపై వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ఢిల్లీ సహా హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్ముకశ్మీర్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తోంది. భారీ వర్షాలు, వరద సంబంధిత ఘటనల్లో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 145 మందికి పైగా మరణించారు. ఇందులో అత్యధికంగా హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోనే 91 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఉత్తరప్రదేశ్‌ లో 14 మంది, హర్యానాలో 16, పంజాబ్‌ లో 11, ఉత్తరాఖండ్‌ లో 16 మంది మృతి చెందారు. కొండ ప్రాంతమైన హిమాచల్‌ ప్రదేశ్‌ లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలతో ఆ రాష్ట్రం అతలాకుతలమైంది. రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. పలు వంతెనలు కొట్టుకుపోయాయి. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ (ఎఓఆ) హెచ్చరించింది.
  జులై 13 నుంచి 17 వరకు ఆ రాష్ట్రం అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. జులై 19 వరకూ ఆ రాష్ట్రంలో తడి వాతావరణం ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇప్పటి వరకూ 636 ఇళ్లు పూర్తిగా ధ్వంసమ య్యాయి. మరో 1,128 పాక్షికంగా దెబ్బతిన్నాయి. మొత్తంగా 1,110 రోడ్లు బ్లాక్‌ అయ్యాయని ఆ రాష్ట్ర రెస్పాన్స్‌ సెంటర్‌ తెలిపింది. వర్షాలు, వరదల కారణంగా దాదాపు రూ.4,000 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు