Wednesday, April 17, 2024

నేడు వీ.హెచ్.పీ. ఆధ్వర్యంలో నిరసనలు..

తప్పక చదవండి

హర్యానా రాష్ట్రంలోని మేవాత్ ప్రాంతంలో జరుగుతున్న అల్లర్లను నిరసిస్తూ నేడు విశ్వహిందూ పరిషత్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని విశ్వహిందూ పరిషత్ అఖిల భారత సంయుక్త మహామంత్రి సురేంద్ర జైన్ సూచించారు. శ్రావణమాసం తొలి సోమవారం రోజు దేవాలయంలో పవిత్ర పూజలు నిర్వహించే సంప్రదాయం పాండవుల కాలం నుంచి వస్తున్నదని, అందులో భాగంగానే నిన్న (శ్రావణ తొలి సోమవారం) మేవాత్ ప్రాంతంలో పూజల కోసం వెళ్లిన హిందూ భక్తులపై జిహాదీముకలు ఘోరంగా దారులకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇద్దరు బజరంగ్దళ్ కార్యకర్తలు.. ఇద్దరు పౌరులు.. ఇద్దరు హోంగార్డులు చనిపోవడం బాధాకరం. ఈ దుర్ఘటనలో నిరసిస్తూ వీ.హెచ్.పీ. కేంద్ర కమిటీ పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్, బజరంగ్దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జిహాదీల దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన తెలుపాలని సూచించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు