Tuesday, June 25, 2024

విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలే..

తప్పక చదవండి
  • బీ.ఆర్.ఎస్. కాదు భారత్ అవినీతి సమితి..
  • వెల్లడించిన ఎబివిపి అఖిల భారతీయ సంఘటన మంత్రి ఆశిష్ చౌహాన్..
  • కదనభేరి నుంచి తెలంగాణ సర్కార్ కు ఏబీవీపీ హెచ్చరిక..

విద్యార్థులనుద్దేశించి ఆశిష్ చౌహాన్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి వచ్చిన విద్యార్థులందరికీ స్వాగతం, సుస్వాగతం.. హైదరాబాద్ ని భారత దేశంలో ఒక గొప్ప అభివృద్ధి చెందిన నగరంగా చూడాలనుకున్నాం.. గడచిన పదేళ్లలో గూగుల్ కంపెనీ హైదరాబాద్ రావాలనుకున్నది. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు చూసి వాళ్ళు పక్క రాష్ట్రాలకి వెళ్లిపోయారు. స్టార్ట్ అప్ కంపెనీల అభివృద్ధిలో తెలంగాణ ఐదవ స్థానంలో ఉన్నది. ఒకటో స్థానంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన విద్యార్థి, యువత మొత్తం కేసీఆర్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు.. కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో వేల స్కూళ్లను మూసివేసింది..
ఉన్నత విద్యలో ఎన్నో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. గడిచిన తొమ్మిదేళ్లలో యువత విద్యార్థిని మోసం చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముంబైకి వచ్చారు.. కానీ రెండుసార్లు అభివృద్ధి చేయమని ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చారు.. కానీ ఇక్కడ ఏమాత్రం అభివృద్ధి లేదు.. ముందు మీ బాధ్యత తెలంగాణను అభివృద్ధి తర్వాత దేశం కోసం ఆలోచించండి అని నేషనల్ సెక్రెటరీ అంకిత పవార్ కేసీఆర్ కు సూచించారు.. ప్రపంచానికి భారత దేశం నాయకత్వం వహిస్తున్నది. కానీ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోతున్నది.. బీ.ఆర్.ఎస్. ఎన్నికలు రాగానే యువతకి ఉద్యోగాలు, రైతులకు సంబంధించి అన్ని హామీలు వస్తాయి.. కేసీఆర్ పేద విద్యార్థులను విద్యకి దూరం చేస్తున్నాడు.. కేసీఆర్ కుటుంబం పాలన వ్యవహార కుటుంబం.. విద్యా సంస్థల్లో ఒక్క టీచర్ కూడా లేని పరిస్థితి.. దేశంలో రాష్ట్రపతి మహిళ ఉంది.. కానీ తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకు స్థానం లేదు.. పాఠశాలలో మహిళలు, విద్యార్థులకు టాయిలెట్స్ లేకపోవడం సిగ్గుపడాల్సిన విషయం. మహారాష్ట్ర నుంచి ఒక్కదాన్నే వచ్చిన.. ఇక్కడినుంచి సీఎం కెసిఅర్ దండయాత్ర లాగా మహారాష్ట్రకు వచ్చాడు.. కానీ ఇక్కడ యువతకు ఉద్యోగాలు లేవు.. తెలంగాణని ముందు అభివృద్ధి చేయి తర్వాత దేశం గురించి ఆలోచించన చెయ్యి..

బ్రిటిష్ పరంపర కొనసాగుతోంది.. కేసీఆర్ బ్రిటిష్ వారసుడు. నియంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కళాకారులు, ఉపాధ్యాయ సంఘాలు పోరాడాలని ఎబివిపి కదన బేరి పిలుపునిస్తున్నది. శ్రీకృష్ణుడు శిశుపాలన 100 తప్పుల వరకు క్షమించాడు. నయా శిశుపాలుడు ( కెసీఆర్) 100 తప్పులు ఎన్నడో దాటాడు. నయా శిశుపాలుడు యొక్క శిరస్సును ఖండించడానికి ఏబీవీపీ సిద్ధంగా ఉన్నది. విద్యార్థి పరిషత్ బహిరంగ లేఖలో ఇచ్చిన డిమాండ్లు నెల రోజుల సమయంలో యాక్సెప్ట్ చేయని పరిస్థితులు ఎదురైతే ప్రగతిభవని ముట్టడిస్తాం. మేము ఉద్యమ కార్యచరణ మొదలుపెట్టాం.. కేసీఆర్ ను గద్దె దించే వరకు వదిలిపెట్టేది లేదు అన్నారు
యజ్ఞవల్క శుక్ల నేషనల్ జనరల్ సెక్రెటరీ..

- Advertisement -

1969 నుంచి జరిగినటువంటి విద్యార్థి ఉద్యమం ద్వారానే తెలంగాణ రాష్ట్రం సిద్దిచింది. టిఆర్ఎస్ బిఆర్ఎస్ అయింది కానీ ప్రజల బ్రతుకు ఏం మారలేదు.
కెసిఆర్ ప్రభుత్వానికి పది సంవత్సరాలు పరిపాలించమని అవకాశం ఇచ్చారు. కానీ కేసీఆర్ అవినీతికి పాల్పడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. నారాయణ, చైతన్య లాంటి కార్పొరేట్ కాలేజీలను మూసివేస్తాను. హామీ ఇచ్చారు కానీ అది అమలు కాలేదు.. నారాయణ, చైతన్య కాలేజీ పెద్ద మాఫియా లాగా తయారయ్యాయి. కేవలం ఈ తెలంగాణ రాష్ట్ర నలుగురి చేతుల్లో బంధీ అయింది. కెసిఆర్ కు ప్రశ్నించడం అంటే నచ్చదు ప్రశ్నించే వాళ్లను జైళ్లో బంది చేస్తున్నారు.. తెలంగాణ రాజ్యం అవినీతిమయమైపోయింది. ప్రగతిభవన్లో అభివృద్ధి చేసే వాళ్ళు కావాలి రావాలి.. లిక్కర్ షాపులు తెలంగాణకు తెచ్చుకున్నాయి అది తెలంగాణ భవిష్యత్తుకు అంత మంచిది కాదు. అన్నారు ఝాన్సీ ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి.. తమ్ముళ్లు మనం ఎక్కల్సింది ఇక్కడ గేట్లు ఎక్కాల్సింది కాదు ప్రగతి భవన్, అసెంబ్లీ గేట్లు దూకాలి.. రాష్ట్రంలో 9000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. టీచర్ పోస్టులు వేయకుండా విద్యార్థులను టీచర్లను వేధిస్తున్నది ఈ ప్రభుత్వం.. 2014లో 11 శాతం నిధులు కేటాయించి 2023 కి వచ్చేసరికి ఆరు శాతానికి తగ్గించారు విద్యారంగం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని దీని ద్వారా తెలుస్తుంది..

ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదు రైతు ఏడ్చిన రాష్ట్రం బాగుపడదంటారు.. తెలంగాణలో ప్రతినిత్యం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. టీస్ పిస్సి పేపర్ లీకేజీలో మంత్రులు సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారు పేపర్ లీకేజీ సర్వసాధారణం అంటూ మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా.. లక్షా 91 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న కేసీఆర్ భర్తీ చేయాలి.. విద్య సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని వెంటనే విద్యార్థులకు చెల్లించాలి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెట్టిన డిమాండ్ అన్నిటిని బేషరతుగా యాక్సెప్ట్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. కెసిఅర్ కి ఏబీవీపీ విద్యార్థి కథనభేరి సభ నుండి డిమాండ్లతో కూడిన బహిరంగ లేఖ రాశారు.. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర కార్యదర్శులు ప్రవీణ్ రెడ్డి, సి డబ్ల్యూ సి శ్రవణ్ బి రాజ్, గ్రేటర్ హైదరాబాద్ నగర కార్యదర్శి శ్రీకాంత్, శ్రీహరి పగిడిపల్లి మాజీ సి డబ్ల్యూ సి నెంబర్ స్టేట్ జాయింట్ సెక్రటరీలు శ్రీనాథ్, పృద్వి, సురేష్, రాంబాబు, సతీష్, మనోజ్, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్లు జీవన్, రంజత్, నరేష్ తేజా శివా, సంతోష్, రాష్ట్ర కార్యదర్శలు సిరివెన్నెల గౌడ్ తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు