Sunday, May 19, 2024

ప్రతిభా పాఠవాలు గల యంగ్ డైనమిక్ హీరో శ్రీరామ్ నిమ్మల..

తప్పక చదవండి

హైదరాబాద్ : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రతిభకి లోటు లేదు. ఎంతోమంది యువ నటులు తెరంగ్రేట్రం చేస్తూ తమ టాలెంట్ ను నిరూపించుకుంటూనే ఉన్నారు.. ప్రేక్షకుల గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించుకుంటూ.. దిన దిన ప్రవర్ధమానంగా ముందుకు సాగిపోతూనే ఉన్నారు.. తమలో దాగివున్న హిడన్ టాలెంట్ ను ఎప్పటికప్పుడు వెండితెర మీద ప్రెజెంట్ చేస్తూ తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుతూ ఉన్నారు.. అలాంటి కోవలోకే వస్తారు యంగ్, టాలెంట్, డైనమిక్ హీరో శ్రీరామ్ నిమ్మల..

ఆకట్టుకునే పర్సనాలిటీతో, ఏ పాత్రలోనైనా ఒదిగిపోయి నటించగలిగే శ్రీరామ్ నిమ్మల.. ఉత్తర సినిమాలో మెయిన్ లీడ్ లోనూ.. సాఫ్ట్ వేర్ బ్లూస్, మది, తురుమ్ ఖాన్లు, రుద్రవీణ తదితర చిత్రాల్లో నటించి మెప్పించారు.. ప్రస్తుతం భారతి ఆర్ట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ ఒన్ లో నటిస్తున్నారు.. మంచి నటుడిగా పేరుతెచ్చుకుని, తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలన్నదే తన ఆశయం అంటున్నారు శ్రీరామ్ నిమ్మల.. ఆయనకు బ్రైట్ ఫ్యూచర్ లభించాలని, మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం.. ఆయన నటించిన తురం ఖాన్లు సినిమా ఈనెల 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది.. తనను ఆశీర్వదించాలి శ్రీరామ్ కోరుకుంటున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు