Friday, July 26, 2024

త్వరలోనే కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన.. !

తప్పక చదవండి
  • అభిప్రాయాలు సేకరించిన మురళీధరన్‌..
  • అలకబూనిన కోమటిరెడ్డి.. బుజ్జగించిన మాణిగం ఠాక్రే..
  • త్వరలోనే మరో స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ ఉంటుంది..

హైదరాబాద్‌ : త్వరలోనే కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. తాజ్‌కృష్ణ హోటల్‌లో ఆయన విూడియాతో మాట్లాడారు. స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ మురళీధరన్‌ను చాలా మంది కలిసి తమ అభిప్రాయాలు చెప్పారన్నారు. అలాగే అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి విషయాలు పరిగణనలోకి తీసుకోవాలనే అంశంపై చర్చించినట్లు తెలిపారు. త్వరలోనే మరోసారి స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం ఉంటుందని చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అలక చెందలేదన్నారు. కాంగ్రెస్‌లో ఆయన ముఖ్యనేత అని తెలిపారు. అయితే సమావేశం మధ్యలోనే ఆయన వెళ్లిపోవడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇదిలావుంటే తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి పార్టీపై అలిగారు. ఇటీవలి కాలంలో కీలక సమావేశాలకు హాజరు కావడం లేదు. స్క్రీనింగ్‌ కమిటీ కీలక భేటీకి సైతం ఆయన డుమ్మా కొట్టారు. పార్టీలో ఇటీవల కీలక పదవులు దక్కక పోవడంపై ఆయన తీవ్ర అసహనానికి లోనైనట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఆయన స్వరం మార్చి ఆత్మగౌరవం ముఖ్యమని సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించడం ప్రారంభించారు. రేవంత్‌ రెడ్డికి టీ పీసీసీ చీఫ్‌ పదవి.. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి స్క్రీనింగ్‌ కమిటీలో పదవి ఇచ్చారని. తనకు మాత్రం ఏ పదవి దక్కలేదని ఆయన అసంతృప్తికి గురయ్యారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలక గురించి తెలుసుకుని బుజ్జగింపులకు ఏఐసీసీ రంగంలోకి దిగింది. ఏఐసీసీ ఆదేశాలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఎంపీ కోమటిరెడ్డికి ఫోన్‌ చేసినట్లు తెలుస్తోంది. సమస్యల్ని అంతర్గతంగానే.. సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ వస్తున్నానని తనను కలవాలని సూచించినట్లు సమాచారం. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌ ఇంఛార్జి మాణిక్‌రావు ఠాక్రే.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి వెళ్లారు. కోమటిరెడ్డితో మాట్లాడారు. పార్టీలో ప్రాధాన్యం తగ్గదని.. సీనియర్‌ లీడర్‌ గా ఆయనకు ప్రాధాన్యం ఉంటుందని హావిూ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి పీసీసీ నాయకత్వాన్ని విబేధిస్తూ.. కోమటిరెడ్డి పార్టీ కార్యక్రమాలకు కొంతకాలం దూరంగా ఉన్నారు. అయితే కర్ణాటక ఎన్నికల విజయం తర్వాత కలిసి పని చేయాలనే అధిష్టానం ఆదేశాలతో కలుపుగోలుగా పని చేయాలని భావించారు. ఈ తరుణంలో.. పార్టీలో చేరికలు, సీట్ల కేటాయింపు అంశం మళ్లీ కోమటిరెడ్డిని అసహనానికి లోను చేశాయి. ఈలోపు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ, సీడబ్ల్యూసీ రెండిరటిలో జాబితా వెలువడడం.. ఆ రెండిరటిలో తనకు పదవి దక్కకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు లోనైనట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కోమటిరెడ్డి వ్యవహారం మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీలో అలజడి రేపుతూనే ఉంది. ప్రతీ సందర్భంలోనూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పార్టీ నేతలు బుజ్జగిస్తూనే ఉన్నారు. తర్వాత చల్లబడుతూ వస్తున్నారు. మళ్లీ ఏదో విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్టీ హైకమాండ్‌ ఆయనను సీనియర్‌ నేతగా గుర్తించింది కానీ.. ప్రత్యేకంగా ఎలాంటి పదవులు ఇవ్వడం లేదు. ఎన్నికలు సవిూపిస్తున్న సమయంలో తనకు ఏదైనా పదవి ఉండాలని ఆయన కోరుకుంటున్నట్లుగా చెబుతున్నారు. తాజాగా బుధవారం జరిగిన స్క్రీనింగ్‌ కమిటీ ముఖ్యమైన సమావేశంలోనూ ఆయన మౌనం వహించారు. ఆయన అలకకు గల అసలు కారణం తెలియనప్పటికీ.. కీలక పదవులు దక్కకపోవడంతో తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బుజ్జగించేందుకు ఏఐసీసీ రంగంలోకి దిగింది. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఎంపీ కోమటిరెడ్డికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఫోన్‌ చేసినట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి తెలంగాణ కాంగ్రెస్‌ ఇంచార్జ్‌ మాణిక్‌ రావ్‌ ఠాక్రే వెళ్లి అసంతృప్తిగా ఉన్న కోమటిరెడ్డిని శాంతింప జేసినట్లు తెలుస్తోంది. స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం అనంతరం ఠాక్రే కూడా కోమటిరెడ్డి ఇంటికి వెళ్తున్నానని.. ఆయన్ను కలుస్తానని ప్రకటన చేశారు. కానీ కోమటిరెడ్డి బలమైన నాయకుడని, కాలక్షేపం చేయడం లేదని సీనియర్‌ నేత భట్టి చెబుతుండడం గమనార్హం. కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ, సీడబ్ల్యూసీ రెండిరటిలోనూ తనకు స్థానం దక్కకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు లోనైనట్లు స్పష్టమవుతోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు