Friday, May 3, 2024

రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి..( ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారన్న దాసోజు శ్రవణ్ )

తప్పక చదవండి
  • 3 ఎకరాల రైతుకు 3 గంటల విద్యుత్ చాలు అని అనడం అవివేకం..
  • రేవంత్ రెడ్డి మూర్ఖుడు చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు..
  • తెలంగాణకు కాంగ్రెస్ పార్టీకి పట్టిన శని రేవంత్ రెడ్డి..
  • సభ్యత , సంస్కారం లేకుండా రేవంత్ రెడ్డి మాటలు..

ఉచిత కరెంట్ ఫై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతులను ‌కకావికలం చేస్తున్నాయి. మూడు పూటలా అన్నం పెట్టే రైతుకు మూడు గంటలే కరెంట్‌ ఇవ్వాలన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై కర్షకలోకం భగ్గుమంటున్నది. రైతుల జోలికి వస్తే ఖబడ్దార్‌ అంటూ దాసోజు శ్రవణ్ హెచ్చరిస్తున్నారు.
రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు తగలపెడుతున్నా ఇంకా బుద్ధి లేక, కేసీఆర్ ఫై విమర్శలు చేస్తున్నాడు. తన వ్యాఖ్యలు బిఆర్ఎస్ వారు వక్రీకరించారు అంటూ సిగ్గులేని రేవంత్ సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి దాసోజు శ్రవణ్‌ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ రాష్ట్ర రైతన్నలు ఎలాంటి కష్టాలు పడ్డారో..? ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో..? కరెంట్ లేక ఎన్ని తిప్పలు పడ్డారో..? ఆధారాలతో మీడియా ముందు ఉంచారు. వీటికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పడాలని శ్రవణ్ డిమాండ్ చేసారు.

తెలంగాణ రాకముందు రైతాంగం.. వ్యవసాయం దండగ అనే రీతిలో ఉండేది. అలాంటి రైతాంగాన్ని సీఎం కేసీఆర్ వ్యవసాయం అంటే ఓ పండగలా మార్చారు. ఇప్పుడు రైతులకు కేసీఆర్ పెద్దన్నలా , తండ్రిలా ఉంటూ వారికోసం పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు ఎలా ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. రోజుకు కనీసం 6 గంటలు కూడా కరెంట్ ఇవ్వలేదు. సాగుకు కరెంట్ కట్ చేసారు. పరిశ్రమలు కరెంట్ కోతలు ఉండేవి. ఇంట్లో ప్రజలు ఉండాలన్న.. పరిస్థితి ఉండేది. ఈనాడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో 24 గంటలు కరెంట్ ఇస్తున్నారా అని శ్రవణ్ ప్రశ్నించారు. సిగ్గుంటే కర్ణాటక లో 24 గంటలు అమలు చేయాలని డిమాండ్ చేసారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో 6 గంటలకు మించి కరెంట్ ఇవ్వరు. ఇవన్నీ రేవంత్ కళ్లు తెరచి చూడాలని సూచించారు. తెలంగాణ లో 24 గంటలు కరెంట్ ఇవ్వడం లేదంటున్న రేవంత్ రెడ్డి ట్రాన్సఫార్మర్ లో వేలు పెట్టాలి.. అప్పుడు రేవంత్ రెడ్డి బ్రతికి ఉంటే రాష్ట్రంలో కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇచ్చినట్లే.. రేవంత్ రెడ్డి చస్తే కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇవ్వనట్లే అని ఎద్దేవా చేసారు శ్రవణ్. ఈరోజు తెలంగాణలో రైతులు బాగుపడుతుంటే.. రేవంత్ రెడ్డి కండ్లలో నిప్పులు పోసుకుంటున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. 2014 నాటికీ తెలంగాణ సాగు విస్తీర్ణం కోటి 30 లక్షల ఎకరాలు ఉంటే.. 2022 నాటికి సాగు విస్తీర్ణం రెండు కోట్ల 20 లక్షలకు పెరిగిందని, సాగు విస్తీర్ణం రెట్టింపు ఎలా అయ్యిందో రేవంత్ కు తెలియదా..? అని శ్రవణ్ ప్రశ్నించారు. ఒకప్పుడు ఎడారిలా ఉన్న పాలమూరు.. ఇప్పుడు కోనసీమలా మారింది. దీనికి కారణం కేసీఆర్.. గతంలో భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి 30 – 40 ఏళ్లు పట్టేది..కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కేవలం మూడున్నర ఏళ్లలో కేసీఆర్ పూర్తి చేసి నీరు అందించిన భగీరధుడు. వ్యవసాయాన్ని, రైతులను కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. రైతుల కోసం రైతు భీమా, రైతు బందు తీసుకొచ్చారు.. ఏదైనా కారణాల వల్ల రైతు మరణం సంభవిస్తే వారి కుటుంబానికి ఈ పథకం కింద రూ .5 లక్షల నష్టపరిహారం అందిస్తున్నాడు. భీమా పొందటానికి రైతులకు ఒక రూపాయి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక రైతు చనిపోయినట్లయితే, మరణించిన 10 రోజులలోపు తన అభ్యర్థికి రూ. 5 లక్షల రూపాయలు పొందుతాడు. ఇది ప్రమాదవశాత్తు భీమా కాదు, కానీ సహజ మరణం కూడా ఉంటుంది. రైతు బీమా కార్యక్రమం కింద, రైతు మరణం సహజమా లేదా ప్రమాదవశాత్తు సంబంధం లేకుండా రైతుల కుటుంబాలకు బీమా మొత్తం అందిస్తున్న దేవుడు కేసీఆర్. అలాంటి దేవుడిఫై సభ్యత, సంస్కారం లేకుండా ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే.. తెలంగాణ రైతులు ఛీ కొడుతున్నారు. అంతే కాదు కాంగ్రెస్ కు , తెలంగాణకు రేవంత్ రెడ్డి శని పట్టినట్లు పట్టాడని, కేవలం తెలంగాణకే కాదు సభ్యసమాజానికి రేవంత్ ఓ శని అని శ్రవణ్ అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు