- అజిత్ పవార్‌కు నాగాలాండ్ ఎమ్మెల్యేల మద్దతు..
- ఈశాన్య రాష్ట్రం నుండి చుక్కెదురైంది వైనం..
- ఎన్సీపీ కార్యాలయంలో ఏడుగురు ఎమ్మెల్యేల బహిరంగ ప్రకటన..
- పార్టీ కార్యకర్తలు, తాము అజిత్ పవార్ వెంటే ఉంటామని వెల్లడి
శరద్ పవార్ కు మరో గట్టి షాక్ తగిలింది. నాగాలాండ్ లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు అజిత్ పవార్ కు మద్దతు తెలిపారు. ఈశాన్య రాష్ట్రంలో ఎన్సీపీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండగా, వారు గురువారం సంయుక్త ప్రకటన చేశారు. తమ మద్దతు అజిత్ కు ఉంటుందని స్పష్టం చేశారు. నాగాలాండ్ ఎన్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. పార్టీ కార్యకర్తలంతా కూడా తమతోనే ఉన్నట్లు చెప్పారు. ఈ నెల ప్రారంభంలో అజిత్ పవార్, మరో ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. అజిత్ పవార్, ఆయన వర్గం ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో చేరడంతో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ చీలిపోయింది. ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏక్ నాథ్ షిండే కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు చేసి, బీజేపీతో జత కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత శివసేనపై షిండే పట్టు సాధించారు. అజిత్ పవార్ కూడా ఎన్సీపీపై పట్టు సాధిస్తున్నారు.