- గంటలతరబడి రోడ్లపైనే ప్రయాణికుల పడిగాపులు..
- పత్తాలేకుండా పోయిన ఆర్టీసీ అధికారులు, పాలకులు
- ప్రసిద్ధ శ్రీచాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి తప్పని తిప్పలు..
చిలిపిచేడ్ : చిలిపిచేడ్ మండల వ్యాప్తంగా 4 గ్రామాలకు లక్షలు వెచ్చించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్ స్టాండులు వీధి కుక్కలపయిన ఘటన స్థానికులను కలవరానికి గురిచేసింది. దీనిలో ముఖ్యంగా చిట్కుల్ గ్రామ పంచాయతీ పరిధిలో మంజీరా తీరానా వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీచాముండేశ్వరి అమ్మవారి ఆలయం ఎదురుగా నిర్మించిన బస్సు స్టాండ్ శిథిలమైపోయి పిచ్చి మొక్కలు మొలిచిన పట్టించుకునే నాథుడు కరువయ్యాడని ఆలయానికి వచ్చిన భక్తులు మొరపెట్టుకుంటున్నారు. దేశంలోనే రెండవ అతి పెద్ద పుణ్య క్షేత్రం కావడం,అలాగే మంజీరా తీరాన ఆలయం ఉండడంతో ఇక్కడికీ భక్తులు ప్రతిరోజు అధిక సంఖ్యలో వస్తుంటారు.వచ్చిన భక్తులు దర్శనం అనంతరం బస్సు ఎక్కాలంటే రోడ్డుపైనే నిల్చోవాల్సిన దుస్థితి ఏర్పడిరది.చాలారోజులుగా బస్సు స్టాండ్ శిథిలావస్థలో ఉన్న బాగు చేయించే వారే కరువయ్యారు. భక్తులకు నిలువ నీడ లేక రోడ్డు పైన నిల్చోవడంతో పలు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు చెబుతున్నారు.వర్షాలు పడినప్పుడు,ఎండలు బాగా ఉన్న కూడా ప్రయాణికులు రోడ్డుపైనే నిల్చుంటున్న పరిస్థితి ఏర్పడిరదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ప్రయా ణికులు కోరుతున్నారు.
శిథిలమైపోతున్న శీలంపల్లి బస్సు స్టాండ్
మండలంలోని శీలంపల్లి గేట్ దగ్గర నిర్మాణం చేసిన బస్సు స్టాండ్ కూడా శితిలావస్థకు చేరుకుని వీధి కుక్కల పాలయిందని స్థాని కులు ఆరోపిస్తున్నారు. . ఈ దుస్థితిపై ప్రయాణికులు అధికా రుల కు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారని అయినా ప్రయోజనం లేకుం డా పోయిందని వారు ఆరోపిస్తున్నారు. నాలుగు గ్రామాల ప్రయా ణికులు,విద్యార్థులు ఇక్కడి నుండే ప్రయాణం కొనసాగి స్తున్నారు. ప్రయాణికులు బస్సు ఎక్కాలంటే రోడ్డుపైనే నిల్చో వాల్సిన పరిస్థితి నెలకొంది.రోడ్డుపై నిల్చోవడంతో వరుస ప్రమాదాలు జరుగు తున్నాయని గ్రాంటులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పట ికయినా అధికారులు,పాలకులు పట్టించుకోని బాగు చేసి ప్రయా ణికుల బాధలు తీర్చాలని స్థానికులు,విద్యార్థులు కోరుతున్నారు.
తప్పక చదవండి
-Advertisement-