Sunday, October 13, 2024
spot_img

చార్మినార్‌ పరిసరాలలో సరైన పిన్‌కోడ్‌తో ఉత్తరాల బట్వాడ

తప్పక చదవండి
  • చార్మినార్‌ హెడ్‌ పోస్టాఫీస్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌ మాస్టర్‌ షౌకత్‌ఖాన్‌
    చార్మినార్‌ : పోస్టల్‌ ఉత్తరాలపై చిరునామాతో పాటు పిన్‌కోడ్‌ను సరిగా రాయాలని చార్మినార్‌ హెడ్‌ పోస్టాఫీస్‌ తంతితపాల శాఖ అసిస్టెంట్‌ పోస్ట్‌ మాస్టర్‌ షౌకత్‌ఖాన్‌ తపాల సేవల విష యంపై వినియోగదారులకు సూచిం చారు. తద్వార ఉత్తరాలు సరైన చిరునామాకు చేరవే యడానికి బట్వాడ చేసే సిబ్బందికి వీలవు తుందని తెలిపారు. పిన్‌కోడ్‌పై అవగాహన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చార్మి నార్‌ హెడ్‌ పోస్టాఫీస్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌ మాస్టర్‌ పాల్గొని మాట్లాడుతూ వినియోగదారులు చాలా ఉత్తరాలలో పిన్‌కోడ్‌ సరిగా రాయక పోవడం వలన ఉత్తరాల బట్వాడలో జాప్యం జరుగుతుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని తపాల సేవలను వినియోగించుకునేవారు ఉత్తరాలపై చిరునామాతో పాటు చార్మినార్‌ పిన్‌కోడ్‌ 500002 అని రాయాలని సూచించారు. ప్రధానంగా శాలీబండా 500065, యాఖుత్‌పుర 500023, సహీఫా 500024, బహదూర్‌పుర 500064, ఫలక్‌నామా 500053,మరియు బేగంబజార్‌ 500012. వినియోగదారులు పైన తెలిపిన పిన్‌కోడ్‌లను గమనించి సరైన పిన్‌కోడ్‌ ఉత్తరాలపై రాసి తపాల బట్వాడలో జాప్యం తగించుకోగలరని మనవి.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు